News February 27, 2025

జన్నారం: 2రోజులపాటు పక్షి మహోత్సవం

image

కవ్వాల్ అభయారణ్యం, గోదావరి పరివాహక ప్రాంత పక్షి వైవిధ్యంపై ప్రజలలో అవగాహన తీసుకువచ్చేందుకు మార్చి 1, 2 తేదీల్లో పక్షి మహోత్సవాన్ని నిర్వహించనున్నామని ఎఫ్ఆర్ఓ సుష్మా రావ్ తెలిపారు. బుధవారం ఆమె మాట్లాడుతూ.. తెలంగాణ అటవీ శాఖ, డబ్ల్యూడబ్ల్యూఎఫ్ ఆధ్వర్యంలో మార్చి 1, 2 తేదీల్లో మంచిర్యాల కలెక్టరేట్ వద్ద పక్షి మహోత్సవాన్ని నిర్వహిస్తారన్నారు. ప్రకృతి, పక్షి ప్రేమికులు, ప్రజలు పాల్గొనవచ్చన్నారు.

Similar News

News March 19, 2025

వడదెబ్బ తాకకుండా ఈ చిట్కాలు పాటించండి

image

కాటన్ వస్త్రాలను ధరించాలి, బయటకు వెళ్లేటప్పుడు వెంట గొడుగు తీసుకెళ్లండి లేదా టోఫి ధరించండి. రోజుకు 3నుంచి 4లీటర్ల నీరు తప్పనిసరిగా తాగుతూ ఉండాలి. ఎండలో పనిచేసేవారు మరింత అధికంగా నీటిని తీసుకోవాలి. కొబ్బరినీళ్లు, ఉప్పు, పంచదార కలిపిన వాటర్ తీసుకుంటూ ఉంటే శరీరం డీ హైడ్రేట్ కాకుండా ఉంటుంది. పండ్ల రసాలు, మజ్జిగ లాంటివి తాగుతూ ఉండండి. అత్యవసరమైతే తప్ప ఎండలో బయటకి వెళ్లకూడదు.

News March 19, 2025

వనపర్తి జిల్లా ప్రజలకు ముఖ్య గమనిక 

image

సీతారాముల కళ్యాణం తిలకించడానికి భద్రాచలం వెళ్లని వారికి ఆర్టీసీ వారు కార్గో సర్వీస్ ద్వారా ఇంటి వద్దకే తలంబ్రాలు అందించనున్నట్లు వనపర్తి ఆర్టీసీ డీఎం వేణుగోపాల్ తెలిపారు. రూ.151 చెల్లించి రసీదు పొందితే భద్రాచలం సీతారాముల కళ్యాణం తలంబ్రాలను కార్గో సర్వీస్ ద్వారా ఇంటికే చేర్చుతారన్నారు. వివరాల కోసం వనపర్తి-9866344200, పెబ్బేరు-8801828143, కొత్తకోట-8886848518, ఆత్మకూర్-7382829494లో సంప్రదించాలన్నారు.

News March 19, 2025

స్టేషన్ ఘనపూర్ కాంగ్రెస్ పార్టీలో లుకలుకలు

image

స్టేషన్ ఘనపూర్ నియోజకవర్గంలోని పలు మండలాల్లో ఒక ఇంట్లో జోడు పదవులు ఇవ్వడంతో కాంగ్రెస్‌లో లుకలుకలు మొదలయ్యాయి. స్టే.ఘ మండల పార్టీ అధ్యక్షుడిగా జూలుకుంట్ల శిరీశ్ రెడ్డి ఉండగా.. అతని భార్య లావణ్యకు మార్కెట్ ఛైర్మన్ పదవిని, అంతేకాకుండా లింగాల ఘనపూర్ మండల పార్టీ అధ్యక్షుడికి జనగామ మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవి, జఫర్గడ్ మండల పార్టీ అధ్యక్షుడికి స్టే.ఘ. మార్కెట్ వైస్ ఛైర్మన్ పదవిని ఎమ్మెల్యే కట్టబెట్టారు.

error: Content is protected !!