News February 8, 2025
జన్నారం:10న పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళ

జన్నారం పట్టణంలోని ప్రభుత్వ ఐటీ కళాశాలలో పీఎం నేషనల్ అప్రెంటిషిప్ మేళాను నిర్వహించనున్నామని కళాశాల ప్రిన్సిపాల్ బండి రాములు తెలిపారు. ఫిబ్రవరి 10న తమ కళాశాలలో అప్రెంటిషిప్ మేళ ఉంటుందన్నారు. ఆసక్తిగల ఐటీఐ కంప్లీట్ చేసిన అభ్యర్థులు బయోడేటా ఫామ్, ఒరిజినల్ సర్టిఫికెట్స్ హాజరు కావాలని ఆయన సూచి. పెన్నార్ ఎలక్ట్రికల్స్, రానే ఇంజన్ వాల్స్, తదితర కంపెనీలో శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించడం జరుగుతుందని తెలిపారు.
Similar News
News November 20, 2025
24 నుంచి కడప జిల్లాలో YS జగన్ పర్యటన.?

ఈనెల 24 నుంచి 3 రోజులపాటు కడప జిల్లాలో YS జగన్ పర్యటిస్తున్నట్టు సమాచారం. ఈ మేరకు జిల్లాలో పార్టీ ముఖ్య నాయకులకు సమాచారం అందినట్లు తెలుస్తోంది. సోమవారం, మంగళవారం, బుధవారం ఆయన పులివెందులతోపాటు పలు ప్రాంతాల్లో పర్యటిస్తారని, జగన్ పర్యటన వివరాలు అధికారికంగా రావాల్సి ఉందని YCP నాయకులు పేర్కొన్నారు.
News November 20, 2025
HYD: DEC30 నుంచి వైకుంఠద్వార దర్శనం

TTD వైకుంఠ ద్వార దర్శనం 2025 కోసం DEC 30 నుంచి జనవరి 8 వరకు ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు HYD అధికారి జయేష్ తెలిపారు. భక్తుల కోసం మొత్తం 164 గంటలకుపైగా దర్శన సమయం కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. మొదటి 3 రోజులు డిసెంబర్ 30, 31, జనవరి 1 తేదీల్లో కేవలం e-Dip టోకెన్లు పొందిన భక్తులకు మాత్రమే దర్శనం లభిస్తుంది. ఈ టైమ్లో ఆఫ్లైన్ టోకెన్లు పూర్తిగా రద్దు చేశారు.
News November 20, 2025
యక్ష ప్రశ్నలు, సమాధానాలు – 10

56. స్నానం అంటే ఏమిటి? (జ.మనస్సులో మాలిన్యం లేకుండా చేసుకోవడం)
57. దానం అంటే ఏమిటి? (జ.సమస్తప్రాణుల్ని రక్షించడం)
58. పండితుడెవరు? (జ.ధర్మం తెలిసినవాడు)
59. మూర్ఖుడెవడు? (జ.ధర్మం తెలియక అడ్డంగా వాదించేవాడు)
60. ఏది కాయం? (జ.సంసారానికి కారణమైంది)
61. అహంకారం అంటే ఏమిటి? (జ.అజ్ఞానం)
<<-se>>#YakshaPrashnalu<<>>


