News March 13, 2025

‘జన్మభూమి’ ఎక్కేవారికి అలర్ట్ 

image

విశాఖ-లింగంపల్లి జన్మభూమి ఎక్స్ ప్రెస్(12805/06)ను సికింద్రాబాద్ వెళ్లకుండా దారి మళ్లించినట్లు వాల్తేర్ డీసీఎం సందీప్ తెలిపారు. ఏప్రిల్ 25 నుంచి విశాఖలో బయలుదేరి సికింద్రాబాద్, బేగంపేట్ వెళ్లకుండా చర్లపల్లి మీదుగా లింగంపల్లి చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఏప్రిల్ 26 నుంచి లింగంపల్లిలో బయలుదేరి సికింద్రాబాద్, బేగం‌పేట్ రాకుండా చర్లపల్లి మీదుగా విశాఖ రానుంది.

Similar News

News April 16, 2026

విశాఖ-లోకమాన్య తిలక్ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

విశాఖపట్నం-లోకమాన్య తిలక్ టెర్మినస్ (18519) ఎక్స్‌ప్రెస్ రైలు రీషెడ్యూల్ అయినట్లు సీనియర్ డీసీఎం కె.పవన్ కుమార్ తెలిపారు. లింక్ రైలు ఆలస్యంగా రావడం వల్ల ఏప్రిల్ 16 రాత్రి 11:20 గంటలకు బయలుదేరాల్సిన ఈ రైలు, ఏప్రిల్ 16 అర్ధరాత్రి 12:30 గంటలకు విశాఖ నుంచి బయలుదేరుతుంది. ప్రయాణికులు ఈ మార్పును గమనించి సహకరించాలని అధికారులు కోరారు.

News April 16, 2026

సింహాచలంలో రేపు ఆర్జిత సేవలు బంద్

image

సింహాచలంలో శుక్రవారం ఆర్జిత సేవలు నిలిపివేసినట్లు దేవస్థానం ఈవో వెంకట్రావు తెలిపారు. శుక్రవారం గంధం అమావాస్య సందర్భంగా.. గురువారం సాయంత్రం నుంచే పుష్కరణి దగ్గర స్నానాలు చేసి శుక్రవారం ఉదయం నుంచి భక్తుల రద్దీ భారీగా ఉంటుందని చెప్పారు. ఈ నేపథ్యంలో అన్ని సేవలు రద్దు చేసినట్లు ఆయన తెలిపారు.

News April 15, 2026

ఇంటర్ రిజల్ట్స్: సత్తాచాటిన విశాఖ జిల్లా విద్యార్థులు

image

ఇంటర్ ఫలితాల్లో విశాఖ జిల్లా <<19653702>>విద్యార్థులు<<>> సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 37,891 మంది పరీక్షలు రాయగా 32,334 మంది పాసయ్యారు. 85 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలో 3వ స్థానంలో నిలిచింది. సెకండ్ ఇయర్‌లో 37,422 మంది పరీక్షలు రాయగా 32,034 మంది పాసయ్యారు. 86 శాతం పాస్ పర్సంటేజీతో రాష్ట్రంలోనే 7వ స్థానంలో నిలిచింది.