News March 7, 2025
జన ఔషది కేంద్రాన్ని సందర్శించిన విశాఖ ఎంపీ

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో మధురవాడలో జన ఔషది దివస్ కేంద్రం వద్ద జనరిక్ మందుల వాడకంపై అవగాహనా కల్పించారు. ఈ కార్యక్రమంలో విశాఖ ఎంపీ శ్రీ భరత్ పాల్గొని జనరిక్ మందుల గూర్చి అన్ని విషయాలను ప్రజలకు అవగాహన కలుగజేసే గోడపత్రికను ఆవిష్కరించారు. జన ఔషది కేంద్రాలను కేంద్ర ప్రభుత్వం అన్ని జిల్లాలో ప్రారంభించడం జరుగుతుందని ప్రజలు ఈ అవకాశం వినియోగించుకోవాలన్నారు. DMHO జగదీశ్వరరావు ఉన్నారు.
Similar News
News December 6, 2025
విశాఖ విమానాశ్రయంలో అయ్యప్ప స్వాముల కష్టాలు

విశాఖ విమానాశ్రయంలోనూ అయ్యప్ప స్వాములు అవస్థలు పడుతున్నారు. రెండు రోజులుగా చుక్కలు చూపిస్తున్న ఇండిగో సర్వీసులు శనివారం కూడా రుద్దయ్యాయి. శబరిమల వెళ్లేందుకు నగరం నుంచి చాలామంది ముందుగానే విమాన టికెట్లు రిజర్వేషన్ చేసుకున్నారు. అయితే ఒక్కసారిగా అన్ని సర్వీసులు రద్దు చేస్తున్నట్లు ఇండిగో ప్రయాణికులకు మెసేజ్‌లు పంపింది. దీంతో స్వాములు ప్రత్యామ్నాయ ఏర్పాట్లకు సిద్ధమవుతున్నారు.
News December 6, 2025
విశాఖ: క్రికెట్ ఫ్యాన్స్‌కు అలర్ట్.. ట్రాఫిక్ ఆంక్షలివే

భారత్-దక్షిణాఫ్రికా వన్డే సందర్భంగా విశాఖ పోలీసులు పార్కింగ్ మార్గదర్శకాలు విడుదల చేశారు. వీఐపీలు NH-16 ద్వారా నేరుగా స్టేడియానికి చేరుకోవాలి. నగరం నుంచి వచ్చే వారు సాంకేతిక కాలేజీ వద్ద, శ్రీకాకుళం వైపు నుంచి వచ్చే వారు కార్ షెడ్, మిధిలాపురి వద్ద పార్క్ చేయాలి. బీచ్ రోడ్ నుంచి వచ్చే వారికి MVV సిటీ, ఆర్టీసీ బస్సులకు లా కాలేజీ వద్ద స్థలం కేటాయించారు.
News December 6, 2025
సింహాచలం: కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య

సింహాచలం కొండ కింద దేవస్థానానికి చెందిన కళ్యాణ మండపంలో తల్లి, కొడుకు ఆత్మహత్య చేసుకున్నారు. ఆధార్ కార్డు ప్రకారం గాజువాకకు చెందిన నీలావతి, అయ్యప్పంజన్‌గా గుర్తించారు. ఇద్దరూ దేవస్థానం కళ్యాణ మండపంలో గురువారం సాయంత్రం రూమ్ తీసుకున్నారు. రూములో ఉరివేసుకోవడంతో దేవస్థానం సిబ్బంది గమనించి గోపాలపట్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ ఘటనా స్థలికి చేరుకొని మృతుల కుటుంబీకులకు సమాచారం అందించారు.


