News November 13, 2024
జపాన్ బృందంతో JNTU ఇన్‌ఛార్జ్ వీసీ సమావేశం

అనంతపురం జేఎన్టీయూ విశ్వవిద్యాలయం ఇన్‌ఛార్జ్ వీసీ సుదర్శనరావు మంగళవారం జపాన్ బృందంతో సమావేశమయ్యారు. అనంతరం పలు ఇంజినీరింగ్ విద్య ప్రణాళికల గురించి వారితో చర్చించారు. ఈ సందర్భంగా ఇన్‌ఛార్జ్ వీసీ మాట్లాడుతూ.. విద్యార్థులకు భవిష్యత్తులో అవసరమయ్యే టెక్నికల్ పరిజ్ఞానాల గురించి అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో ఇన్‌ఛార్జ్ వీసీతో పలువురు విద్యావంతులు పాల్గొన్నారు.
Similar News
News March 13, 2026
భార్యను చంపిన హత్య కేసులో భర్త అరెస్ట్

పెద్దపప్పూరు మండలం ముచ్చుకోట అటవీ ప్రాంతంలో భార్యను చంపిన భర్తను పోలీసులు అరెస్ట్ చేశారు. తాడిపత్రికి చెందిన శ్రీలేఖ ప్యాపిలి మండలం నల్లమేకలపల్లికి చెందిన సుధాకర్‌ను వివాహం చేసుకుంది. అయితే భార్యాభర్తల మధ్య విభేదాలు రావడంతో భక్త సుధాకర్ శ్రీలేఖను చున్నీతో మెడకు బిగించి హత్య చేసి పడివేశారన్నారు. సుధాకర్‌ను అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించినట్లు సీఐ రామసుబ్బయ్య తెలిపారు.
News March 12, 2026
గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు వేగవంతం చేయాలి: జేసీ

ఈనెల 14, 15వ తేదీల్లో నిర్వహించే గుత్తి కోట ఉత్సవాల ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని జేసీ విష్ణుచరణ్ అధికారులను ఆదేశించారు. గురువారం టెలీకాన్ఫరెన్స్‌లో ఆయన మాట్లాడారు. ఫుట్‌బాల్ గ్రౌండ్‌లో వెన్యూ, స్టాల్స్ సిద్ధం చేయడం, రోడ్ల ప్యాచ్ వర్క్, తాగునీరు, లైటింగ్, పార్కింగ్, భద్రత, ట్రాఫిక్ ఏర్పాట్లు చేయాలని సూచించారు. సాంస్కృతిక కార్యక్రమాలు, హెరిటేజ్ వాక్, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయాలన్నారు.
News March 12, 2026
అనంత: పరీక్షలకు 286 మంది డుమ్మా!

అనంతపురం జిల్లాలో నేడు ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం విద్యార్థులకు కామర్స్ పరీక్ష జరిగింది. ఈ రోజు పరీక్షలకు సెట్-I ప్రశ్నపత్రాన్ని వాడినట్లు RIO వెంకటరమణ నాయక్ తెలిపారు. జనరల్ విద్యార్థులు 5,223 గాను 4,937 మంది హాజరయ్యారని పేర్కొన్నారు. ఈ పరీక్షలకు 286 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారని తెలిపారు. పరీక్షలను CC కెమెరాల పర్యవేక్షణలో పకడ్బందీగా నిర్వహించామన్నారు.


