News February 26, 2025
జపాన్ సకురాకు సంగారెడ్డి ప్రాజెక్టు.. కలెక్టర్ అభినందనలు

జపాన్ సుకూరాకు ఎంపికైన ఆందోల్ మండలం కన్సాన్పల్లి జిల్లా పరిషత్ పాఠశాల విద్యార్థి స్రవంతి, గైడ్ ఉపాధ్యాయుడు సిద్ధేశ్వరని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం సన్మానించారు. విద్యార్థిని తయారు చేసిన డిస్క్ లిఫ్టర్ ప్రాజెక్టు గురించి కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. జపాన్ వెళ్లి మన జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని సూచించారు. కార్యక్రమంలో జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News February 26, 2025
వాళ్లిద్దరినీ హిందూ ఓటర్లు బహిష్కరించాలి: కేంద్ర మంత్రి

రాహుల్ గాంధీ, ఉద్ధవ్ ఠాక్రేను హిందూ ఓటర్లు బాయ్ కాట్ చేయాలని కేంద్ర మంత్రి రాందాస్ అథవాలే అన్నారు. వాళ్లిద్దరూ కుంభమేళాకు వెళ్లకుండా హిందూ కమ్యూనిటీని అవమానించారని పేర్కొన్నారు. ‘వారికి హిందువుల ఓట్లు కావాలి. కానీ మహాకుంభమేళాకు మాత్రం రారు. అందుకే హిందూ ఓటర్లు వారిని బహిష్కరించాలి’ అని పేర్కొన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో వారికి హిందూ ఓటర్లు ఇప్పటికే గుణపాఠం చెప్పారని అన్నారు.
News February 26, 2025
ఏలూరులో ఇద్దరు గల్లంతు

స్నానానికి దిగి ఇద్దరు గల్లంతైన ఘటన చోటు చేసుకుంది. ఏలూరు నగరం వట్లూరు ప్రాంతానికి చెందిన జుజ్జువరపు వెంకటేశ్వరరావు స్థానికంగా ఉన్న చెరువులో స్నానానికి దిగాడు. చెరువు ఊబిలో కూరుకుపోతుండగా అది గమనించిన అతని అన్న కొడుకు జుజ్జువరపు సుబ్రహ్మణ్యం అతన్ని కాపాడేందుకు చెరువులోకి దిగాడు. ఇద్దరు ఊబిలో ఇరుక్కుని గల్లంతయ్యారు. పోలీసులు, రెస్క్యూ టీం బృందాలు గాలింపు చర్యలు చేపట్టారు.
News February 26, 2025
నిమ్మనపల్లి వద్ద ట్రాక్టర్ బోల్తా.. వ్యక్తి మృతి

ఒడిశా రాష్ట్రానికి చెందిన పొదన్, దీపక్లు ఎగువ మాచిరెడ్డిగారిపల్లె వద్ద ఉన్న ఇటుకల బట్టీలో పనిచేస్తున్నారు. బుధవారం ఇటుకుల బట్టి నుంచి ఇటుకులను లోడ్ చేసుకుని బోయకొండ వద్ద అన్లోడ్ చేసి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ట్రాక్టర్ డ్రైవర్ పరారు కాగా, పొదన్ అక్కడికక్కడే మృతి చెందారు. ఎస్సై తిప్పేస్వామి సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అనంతరం కేసు నమోదు చేశారు.