News December 22, 2024

జమిలి ఎన్నికలకు మా పార్టీ సంపూర్ణ మద్దతు: సుబ్రహ్మణ్యం

image

ఒకే దేశం ఒకే ఎన్నిక పేరుతో ఎన్డీఏ ప్రభుత్వం జమిలి ఎన్నికలు నిర్వహించడం కోసం తెచ్చిన బిల్లు అన్ని పార్టీలు సమర్థించాలని నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం అన్నారు. శనివారం చిలకలూరిపేట నవతరం పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు బిల్లు చారిత్రాత్మక నిర్ణయమని, చరిత్రలో నిలిచిపోయే బిల్లు అని అన్నారు. జమిలి ఎన్నికలకు తమ పార్టీ సంపూర్ణంగా మద్దతు ఇస్తుందని రావు తెలిపారు.

Similar News

News December 20, 2025

మంగళగిరి: 79వ రోజు మంత్రి లోకేశ్‌ ‘ప్రజాదర్బార్’

image

మంగళగిరిలోని TDP కేంద్ర కార్యాలయం NTR భవన్‌లో శనివారం మంత్రి లోకేశ్‌ 79వ రోజు ప్రజాదర్బార్ నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా వచ్చిన బాధితుల నుంచి వినతులు స్వీకరించి, వాటి పరిష్కారానికి అధికారులను ఆదేశించారు. RTCలో మెడికల్‌ అన్‌ఫిట్‌ అయిన 170 మంది ఉద్యోగుల పిల్లలకు కారుణ్య నియామకాల కింద ఉద్యోగాలు కల్పించాలని బాధితులు కోరగా, సానుకూలంగా స్పందించారు. సమస్యలను పరిష్కరిస్తామని మంత్రి వారికి హామీ ఇచ్చారు.

News December 20, 2025

జర్నలిస్టుల సెమినార్‌కు వస్తా: మంత్రి లోకేశ్‌

image

APUWJ ఆధ్వర్యంలో జనవరిలో నిర్వహించే సెమినార్‌కు హాజరవుతానని మంత్రి లోకేశ్‌ హామీ ఇచ్చారు. శనివారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో ఐజేయూ జాతీయ అధ్యక్షుడు, తెలంగాణ మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాసరెడ్డి నేతృత్వంలోని జర్నలిస్టుల బృందం మంత్రిని కలిసింది. ఈ సందర్భంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న పలు సమస్యలను ఆయన దృష్టికి తీసుకెళ్లగా, సానుకూలంగా స్పందించిన మంత్రి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు.

News December 20, 2025

మాస్టర్స్ అథ్లెటిక్స్‌లో గుంటూరు పోలీసుల పతక వర్షం

image

నెల్లూరు ఏసీ సుబ్బారెడ్డి స్టేడియంలో జరిగిన 44వ ఏపీ రాష్ట్ర మాస్టర్స్ అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్-2025లో గుంటూరు జిల్లా పోలీస్ సిబ్బంది సత్తా చాటారు. ముగ్గురు ఏఎస్ఐలు, ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు, ఒక హోంగార్డు కలిపి ఆరుగురు పాల్గొని మొత్తం 18 పతకాలు (14 స్వర్ణాలు, 3 రజతాలు, 1 కాంస్యం) సాధించారు. వివిధ వయో విభాగాల్లో ట్రాక్, ఫీల్డ్ ఈవెంట్లలో మెరిసిన విజేతలను ఎస్పీ వకుల్ జిందాల్ అభినందించారు.