News February 25, 2025
జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు: అనకాపల్లి ఎంపీ

జమిలి ఎన్నికలతో ఎన్నో ప్రయోజనాలు ఉంటాయని అనకాపల్లి ఎంపీ సీఎం రమేశ్ అన్నారు. ఒకే దేశం ఒకే ఎన్నికకు సంబంధించి బిల్లును పరిశీలించడానికి ఏర్పాటైన జాయింట్ పార్లమెంటరీ కమిటీ సమావేశం మంగళవారం ఢిల్లీలో నిర్వహించారు. ఈ కమిటీలో సభ్యుడైన సీఎం రమేశ్ సమావేశంలో పాల్గొని బిల్లుపై చర్చించారు. దేశంలో అసెంబ్లీ, పార్లమెంటుకు ఒకేసారి ఎన్నిక జరగడం వల్ల ఖర్చు ఆదా అవుతుందన్నారు.
Similar News
News December 4, 2025
రంగారెడ్డి: తొలి విడతలో ఆరుగురు సర్పంచ్లు ఏకగ్రీవం

రంగారెడ్డి జిల్లాలో తొలి విడతలో 174 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు నిర్వహించాల్సి ఉండగా ఆరుగురు సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగిలిన 168 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. 530 మంది సర్పంచ్ అభ్యర్థులు ఎన్నికల బరిలో ఉన్నారు. 1,530 వార్డు స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా 190 వార్డు స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. మిగతా 1,340 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. మొత్తంగా 3,379 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.
News December 4, 2025
ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలి: కలెక్టర్

షెడ్యూల్ ప్రకారం అన్ని ధాన్యం కొనుగోలు కేంద్రాలు పూర్తిస్థాయిలో పనిచేయాలని కలెక్టర్ మహేశ్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమలాపురం కలెక్టరేట్లో జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడారు. రబీ సీజన్ను దృష్టిలో ఉంచుకుని రైతులకు అవసరమైన యూరియా, పొటాష్ తదితర రసాయన ఎరువులను అందుబాటులో ఉంచాలని సూచించారు. డిమాండ్ను దృష్టిలో ఉంచుకుని అదనపు నిల్వలు సిద్ధం చేసుకోవాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు.
News December 4, 2025
జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోండి: తిరుపతి కలెక్టర్

APSSDC ఆధ్వర్యంలో 6వ తేదీ గూడూరు పట్టణంలోని DRW డిగ్రీ కళాశాల జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు తిరుపతి జిల్లా నైపుణ్యభివృద్ధి శాఖ అధికారి లోకనాథం పేర్కొన్నారు. గురువారం తిరుపతి జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ జాబ్ మేళా పోస్టర్ ఆవిష్కరించినట్లు తెలియజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. 15 కంపెనీల ప్రతినిధులు వస్తారని, 700 ఖాళీలు భర్తీ చేయనున్నట్లు చెప్పారు. జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలన్నారు.


