News May 25, 2024
జమ్మలమడుగులో అత్యధిక ఉష్ణోగ్రత

భానుడి భగభగలతో జిల్లా ప్రజలు ఉక్కపోతకు గురవుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు కాస్త ఉపశమనం పొందినా.. తిరిగి సూర్యుడు విలయతాండవం చేస్తున్నాడు. శుక్రవారం జిల్లాలో అత్యధికంగా జమ్మలమడుగులో 41.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. వల్లూరు, పెద్దముడియంలో 40.7, ఒంటిమిట్ట, కడప, సిద్దవటంలో 40.6, అట్లూరులో 39.1, చెన్నూరులో 39.8 డిగ్రీలు, ఇలా మిగిలిన మండలాల్లో సైతం 35 డిగ్రీల పైగానే ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.
Similar News
News October 2, 2025
మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏకు బెయిల్

మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా పీఏ ఖాజాకు కడప కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఎమ్మెల్యే మాధవి రెడ్డిపై సోషల్ మీడియాలో ఓ వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణల నేపథ్యంలో కడప పోలీసులు ఆయనను <<17897036>>అరెస్ట్<<>> చేశారు. ఈ క్రమంలో కోర్టులో ప్రవేశపెట్టగా ఖాజాకు బెయిల్ మంజూరు చేస్తున్నట్లు న్యాయస్థానం తీర్పునిచ్చింది.
News October 2, 2025
వేముల : పెరిగిన చామంతి పూల ధరలు

ప్రస్తుతం మార్కెట్లో చామంతి ధరలు పెరిగాయి. బయట మార్కెట్లో కిలో చామంతి పూలు రూ. 70ల నుంచి రూ.80లు పలుకుతున్నాయి. చామంతి పూలను ఎక్కువగా చెన్నై, బెంగుళూరు, హైదరాబాద్ తదితర ప్రాంతాల మార్కెట్లకు తరలిస్తున్నారు. వారం రోజుల క్రితం చామంతి ధరలు పడిపోయాయి. దసరా, దీపావళి పండుగలతోపాటు కార్తీకమాసం నేపథ్యంలో చామంతి ధరలు పెరిగాయి. దీంతో రైతులు తోటల వద్ద చామంతి పూలను కోసి మార్కెట్లకు తరలిస్తున్నారు.
News October 2, 2025
మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష పీఏ అరెస్ట్

మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష వ్యక్తిగత సహాయకుడు షేక్ ఖాజాను కడప వన్ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే మాధవి రెడ్డి ఫిర్యాదు మేరకు తనపై సోషల్ మీడియాలో వ్యక్తిగతంగా దూషణలతో ఉన్న వీడియోను వైరల్ చేశారన్న ఆరోపణలతో ఆయనను హైదరాబాదులో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ తెల్లవారుజామున కడప నగర శివారులోని జిల్లా పోలీసు శిక్షణ కేంద్రానికి తీసుకుని వచ్చారు. కాసేపట్లో పూర్తి వివరాలు వెల్లడిస్తామని తెలిపారు.