News January 24, 2025

జమ్మలమడుగు: కోడితో వచ్చిన కొట్లాట

image

కోడి తెచ్చిన తంటా ఘటన పోలీస్ స్టేషన్ వరకు వెళ్లింది. వివరాల్లోకి వెళ్తే.. జమ్మలమడుగు(M), పొన్నతోటలో ఉండే నాగలక్ష్మమ్మ చెట్టుపై పక్కింటి కోళ్లు వచ్చి పెంట వేస్తున్నాయని రోషమ్మకు చెప్పింది. దీంతో రోషమ్మ కుటుంబ సభ్యులతో నాగలక్ష్మమ్మ ఇంటిపై దాడి చేశారు. ఈ ఘటనలో నాగలక్ష్మమ్మ, భర్త, కొడుకు, కోడలుకు తీవ్ర గాయాలు కాగా, ఆసుపత్రిలో చేర్చారు. ఎస్ఐ రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Similar News

News January 10, 2026

ప్రొద్దుటూరులో నేటి బంగారు, వెండి ధరలు..!

image

ప్రొద్దుటూరు బులియన్ మార్కెట్లో శనివారం బంగారు, వెండి ధరల వివరాలు.
* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

* బంగారు 24 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.14,145
* బంగారు 22 క్యారెక్టర్ ఒక గ్రాము ధర రూ.13,013
* వెండి 10 గ్రాములు ధర రూ.2,540

News January 10, 2026

గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

image

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్‌లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.

News January 10, 2026

యాక్సిడెంట్.. కడప యువకుడి మృతి

image

కదిరిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కడప జిల్లా లింగాలలోని రామట్ల పల్లికి చెందిన అశోక్ (26) మృతి చెందాడు. బెంగళూరుకు బైకులో వెళుతుండగా మార్గమధ్యంలో డివైడర్‌ను ఢీ కొనడంతో ప్రమాదం జరిగినట్లు సమాచారం. దీంతో మృతుని కటుంబంలో విషాదం అలుముకుంది.