News August 12, 2024
జమ్మలమడుగు ఘాట్ రోడ్డులో చిరుత సంచారం
జమ్మలమడుగు-ముద్దనూరు రహదారిలో చిరుత కనిపించినట్లు స్థానిక యువకులు తెలిపారు. ఈ విషయాన్ని ఆ కొండ ప్రాంతంలో ఉన్న గొర్రెల కాపరులకు తెలియజేశారు. వివరాల్లోకి వెళితే.. ముద్దనూరు పట్టణంలోని వ్యర్థాలను ముద్దనూరు-జమ్మలమడుగు ప్రధాన రహదారిలో వేస్తున్నారు. ఈ వ్యర్థాల వద్దకు పందులు, కుక్కలు ఎక్కువ సంచరిస్తూ ఉండేవి. ఇందులో భాగంగా ఆ కుక్కలు, పందుల కోసం చిరుత సంచరించినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News September 18, 2024
ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్
కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు
News September 17, 2024
రాజంపేట: సెప్టెంబర్ 20న జాబ్ మేళా నిర్వహణ
రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 20న జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైదియా దేవి పాల్గొన్నారు.
News September 17, 2024
కడప ఆర్మీ జవాన్ ఆకస్మిక మృతి
వేంపల్లి పట్టణంలోని శ్రీరాంనగర్‌కు చెందిన చల్లా.సుబ్బారావు ఆర్మీలో ఉద్యోగం చేస్తు మరణించినట్లు బంధువులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్‌లో ఆర్మీలో 18 ఏళ్లుగా ఉద్యోగం చేసేవాడు. ఈనెల 15వ తేదీన అనారోగ్యంతో మరణించడంతో ఆయన మృతదేహాన్ని మంగళవారం వేంపల్లెకు తీసుకువచ్చారు. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భార్య రేణుకా వారికి ఇద్దరు పిల్లలు హేమ,జగదీష్ కలరు. ఆర్మీ లాంఛనాలతో అంత్యక్రియలు చేశారు.