News November 15, 2024

జమ్మలమడుగు: పుష్ప-2 క్రేజ్ మామూలుగా లేదుగా!

image

ఉమ్మడి అనంతపురం జిల్లాల్లో ‘పుష్ప-2’ మేనియా ఓ రేంజ్‌లో ఉంది. డిసెంబర్ 5న సినిమా రిలీజ్ కానుండగా ఎక్కడికక్కడ అల్లు అర్జున్ ఫ్యాన్స్ భారీ ఎత్తున సెలబ్రేషన్స్‌కు ప్లాన్ చేసుకుంటున్నారు. భారీ కటౌట్లు, ప్రత్యేక కార్యక్రమాలతో థియేటర్ల వద్ద హడావుడి చేసేందుకు రెడీ అవుతున్నారు. జమ్మలమడుగులో భారీ కటౌట్ ఏర్పాటు చేస్తున్నామని ఫ్యాన్స్ ప్రకటించారు. ట్రైలర్  రిలీజ్ ఈవెంట్‌ను ఘనంగా నిర్వహిస్తామని వెల్లడించారు.

Similar News

News March 15, 2026

బద్వేల్‌లో గ్యాస్ సిలిండర్లు స్వాధీనం

image

బద్వేల్‌లోని హోటళ్లపై ఆదివారం కడప జాయింట్ కలెక్టర్, డిస్ట్రిక్ట్ సప్లై ఆఫీసర్, బద్వేల్ ఆర్డీఓ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు మైదుకూరు రోడ్ పరిసర ప్రాంతాల్లోని పలు హోటళ్లలో ఆదివారం తనిఖీలు చేపట్టారు. పలువురు నిబంధనలకు విరుద్ధంగా కమర్షియల్ గ్యాస్ వినియోగిస్తున్నట్లు గుర్తించారు. ఈ దాడుల్లో 7 గ్యాస్ సిలిండర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

News March 15, 2026

పులివెందుల: నిందితులు చెప్పింది వినడమే CBI పనా..?

image

మాజీ మంత్రి వైయస్ వివేకా హత్య కేసులో నిందితులు చెప్పింది వినడమే CBI పనా?, సొంతంగా ఆలోచించదా..? అని ఆయన కుమార్తె YS సునీత ప్రశ్నించారు. పులివెందులలో ఆదివారం ఆమె మాట్లాడుతూ.. నేను రాత్రింబవళ్లు కష్టపడితే కొంత ఇన్ఫర్మేషన్ వచ్చిందన్నారు. వివేకా హత్య విషయంలో ప్రజలకు కరెక్ట్ ఇన్ఫర్మేషన్ కావాలని, దీనిపై పోరాటం జరుగుతూనే ఉంటుందన్నారు.

News March 15, 2026

కడప: 16 నుంచి పశువులకు టీకాలు

image

ఈనెల 16 నుంచి ఏప్రిల్ 20 వరకు జిల్లాలో ప్రతి గ్రామంలోని పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను వేయనున్నట్లు జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి డాక్టర్ ఎన్.ఏ.శ్రీనివాసులు తెలిపారు. కడప జిల్లాకు 3 లక్షల డోసులను కేటాయించామన్నారు. పాడి పశువుల యాజమానులందరూ పశువైద్య సిబ్బందికి సహకరించాలని కోరారు. గాలి కుంటు వ్యాధి సోకుతే పాల దిగుబడి తగ్గుతుందన్నారు. రైతులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు.