News September 6, 2024
జమ్మలమడుగు: బైకు అదుపు తప్పి.. విద్యార్థిని మృతి

కడప జిల్లా ముద్దనూరుకి చెందిన సుంకన్న అనే వ్యక్తి రేపు పండగ కావడంతో హాస్టల్ నుంచి పిల్లలను తీసుకురావడానికి మైలవరం వచ్చాడు. అనంతరం ఇద్దరు కూతుర్లతో ముద్దనూరు వెళ్తుండగా.. మార్గమధ్య సుంకన్నకు BP డౌన్ అయి బైక్ అదుపు తప్పి పిల్లలతో సహా కింద పడ్డాడు. దీంతో 5వ తరగతి చదువుతున్న పెద్ద కూతురు సుమ (10) అక్కడికక్కడే మృతి చెందగా.. 2వ కూతురు సుప్రియకి తీవ్ర గాయాలు కాగా.. తండ్రికి స్వల్ప గాయాలయ్యాయి.
Similar News
News November 23, 2025
కడప: గ్రామ స్థాయికి వెళ్లని స్వచ్ఛాంధ్ర ప్రచారం?

ప్రతి నెలా 3వ శనివారం అధికారులు స్వచ్ఛాంధ్ర – స్వర్ణాంధ్ర అంటూ ప్రచారం చేసినా, గ్రామస్థాయిలో అమలు కావడం లేదని స్పష్టమవుతోంది. ఆదివారం కమలాపురం మండలం <<18369261>>ఎర్రగుడిపాడులోని<<>> ఓ కాలనీ ప్రజలు విరేచనాలు, వాంతులతో మంచాన పడ్డారు. దీనికి కారణం అక్కడి వారికి పారిశుద్ధ్యంపైన అవగాహన లేకపోవడమేనని పలువురు తెలిపారు. ప్రభుత్వ ఆశయాలను అధికారులు గ్రామస్థాయిలోకి తీసుకెళ్లట్లేదని చెప్పడానికి ఇదొక నిదర్శనంగా చెప్పవచ్చు.
News November 23, 2025
సెమీఫైనల్లోకి దూసుకెళ్లిన కడప జట్టు

69వ రాష్ట్ర స్థాయి సాఫ్ట్ బాల్ అండర్-14 పోటీల్లో కడప జిల్లా బాలురు, బాలికల జట్లు సెమీఫైనల్లోకి ప్రవేశించాయి. బాలురు గోదావరి జట్టును, బాలికలు కృష్ణా జట్టును ఓడించి సెమీస్లో అడుగుపెట్టాయి. అలాగే ప్రకాశం, అనంతపురం, ఈస్ట్ గోదావరి, విజయనగరం బాలికల జట్లు కూడా సెమీఫైనల్కు చేరాయి. బాలుర విభాగంలో విశాఖపట్నం, విజయనగరం, ఈస్ట్ గోదావరి జట్లు సెమీస్లో ప్రవేశించాయి. రేపు ఉదయం సెమీఫైనల్స్ జరగనున్నాయి.
News November 23, 2025
మైదుకూరు: గౌడౌన్లలో నిల్వ ఉన్న 6858.45 కేజీల స్టీల్పై అనుమానాలు

మైదుకూరు హౌసింగ్ శాఖకు సంబంధించిన స్టీలు నిల్వల్లో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మార్చి నెలలో 6858.45 కేజీల స్టీలు పంపిణీలో అవినీతి చోటు చేసుకున్నట్లు అధికారులకు నివేదికలు వెళ్లాయి. అయితే విచారణకు అధికారులు వచ్చే లోపు స్టీలు అందుబాటులో ఉంచారన్న వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ అంశంపై తిరిగి ఫిర్యాదులు అందుతున్నాయి. ప్రస్తుతం నిల్వ ఉన్న స్టీలు గతంలో సరఫరా చేసిందా? కాదా? అనేది తెలియాల్సి ఉంది.


