News May 26, 2024
జమ్మలమడుగు: యాచకుల మధ్య ఘర్షణ.. ఒకరు మృతి

ముద్దనూరు రైల్వే స్టేషన్‌లో ఓ మహిళ మృతి చెందింది. పోలీసుల వివరాల ప్రకారం.. ఆదివారం ఇద్దరు యాచకులు మద్యం మత్తులో గొడపడ్డారు. ఈ క్రమంలో ఒకరు బండరాయితో దాడిచేయగా మహిళ అక్కడికక్కడే మృతి చెందింది. ఘటనా స్థలానికి ముద్దనూరు సివిల్ పోలీసులు, ఎర్రగుంట్ల రైల్వే సీఐ చేరుకొని దాడికి పాల్పడ్డ వారిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News November 23, 2025
ప్రొద్దుటూరులో అప్పులోళ్ల ఆందోళన..!

ప్రొద్దుటూరు బంగారు వ్యాపారి శ్రీనివాసులు కేసులో మరో ట్విస్ట్ వెలుగులోకి వచ్చింది. ఆయనకు ఆభరణాల తయారీకి ఆర్డర్లు ఇచ్చామని పలువురు చెప్పుకొచ్చారు. అడ్వాన్స్‌లు కూడా ఇచ్చామని, ఇతను పెద్ద మొత్తంలో చీటీలు నిర్వహిస్తున్నాడని తెలిపారు. దాదాపు రూ.10 కోట్ల వరకు ఉంటుందని బాధితులు వాపోతున్నారు. ఆయన జైలుకు పోతే తమ డబ్బులు రావేమోనని భయపడిపోతున్నారు. తమ డబ్బులు కూడా పోలీసులే వసూలు చేయించాలని కోరుతున్నారు.
News November 23, 2025
కడప జిల్లాలో వ్యక్తిపై కత్తితో దాడి.!

ముద్దునూరుకు చెందిన వినోద్ అనే వ్యక్తిని అదే ప్రాంతానికి చెందిన నర్సింహులు శనివారం కత్తితో దాడి చేసినట్లు స్థానిక SI తెలిపారు. ముద్దనూరు ఉన్నత పాఠశాల ప్రాంగణంలో స్మార్ట్ కిచెన్ పనుల విషయంలో ఈ దాడి జరిగిన ఎస్సై వివరించారు. గాయపడిన వ్యక్తిని చికిత్స కోసం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
News November 23, 2025
పొద్దుటూరు పోలీసుల చర్యతో ప్రజల్లో ఆందోళన..!

కొద్ది రోజులక్రితం ప్రొద్దుటూరులో వడ్డీ వ్యాపారి వేణుగోపాలరెడ్డిని కిడ్నాప్ చేసి హత్య చేసిన విషయం తెలిసిందే. ఆ ఘటన మరువకముందే శుక్రవారం రాత్రి పొద్దుటూరులో మరో బంగారు వ్యాపారి శ్రీనివాసులును కూడా కిడ్నాప్ చేశారు. ఈ మేరకు ఆయన భార్య లక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేశారు.పోలీసులు 24 గంటలు కుటుంబ సభ్యులకు, మీడియాకు సమాచారం ఇవ్వలేదన్న ఆరోపనలు ఉన్నాయి. శ్రీనివాసులును రక్షించాలని స్థానికులు పోలీసులను కోరారు.


