News July 2, 2024
జమ్మికుంట: ఈరోజు పత్తి ధర రూ.7,500

జమ్మికుంట పత్తి మార్కెట్‌లో పత్తి ధర నిలకడగానే కొనసాగుతుంది. మంగళవారం మార్కెట్‌కు రైతులు 12 వాహనాల్లో 184 క్వింటాల విడి పత్తి విక్రయానికి తీసుకురాగా.. గరిష్ఠంగా రూ.7,500, కనిష్ఠంగా రూ.7,200 పలికిందని మార్కెట్ అధికారులు తెలిపారు. పత్తి ధరలు పెరగకపోవడంతో రైతులు నిరాశ చెందుతున్నారు. మార్కెట్లో కొనుగోలు పక్రియ జోరుగా సాగుతుంది.
Similar News
News September 18, 2025
KNR: నేటి నుంచి సదరం క్యాంపులు

కరీంనగర్ ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రి ఆధ్వర్యంలో నేటి నుంచి 24వ తేదీ వరకు సదరం క్యాంపులు జరగనున్నాయని జిల్లా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హులైన దివ్యాంగులు మీసేవ కేంద్రాల ద్వారా తమ పేరును నమోదు చేసుకొని, కేటాయించిన తేదీల్లో ప్రభుత్వ ప్రధాన ఆసుపత్రిలో హాజరుకావాలని కోరారు. మొత్తం 676 మందికి ఈ క్యాంపుల్లో పరీక్షలు నిర్వహిస్తామని ప్రకటనలో పేర్కొన్నారు.
News September 18, 2025
KNR: SRR కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

KNR సిటీలోని SRR ప్రభుత్వ కళాశాలలో వివిధ కోర్సులలో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దోస్త్ 2వ విడత స్పాట్ అడ్మిషన్స్ ప్రక్రియ షెడ్యూల్ ప్రకారం నేడు, రేపు నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ కే.రామకృష్ణ తెలిపారు. కళాశాలలో వివిధ కోర్సుల్లో 57 సీట్లు ఖాళీగా ఉన్నాయన్నారు. స్పాట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ సర్టిఫికెట్లు, ఒక సెట్ జిరాక్స్ కాపీలతో సమయానికి హాజరుకావాలన్నారు.
News September 17, 2025
HZB: తల్లిని చూసుకుంటామని ముందుకొచ్చిన కుమారులు

హుజూరాబాద్ మండలం కనుకులగిద్దెకు చెందిన ములుగు రాజమ్మ తన ముగ్గురు కుమారులు తనను పోషించడం లేదని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. దీనిపై స్పందించిన RDO ముగ్గురు కుమారులు ఒక్కొక్కరు నెలకు రూ.3,000 చొప్పున తల్లి పోషణ నిమిత్తం ఇవ్వాలని ఇటీవల ఆదేశాలు జారీ చేశారు. కాగా, దీని అమలుపై జిల్లా కలెక్టర్, సంక్షేమ అధికారిణి ఆధ్వర్యంలో విచారణ జరపగా రాజమ్మ కుమారులు ఇకపై తమ తల్లిని చక్కగా చూసుకుంటామని హామీ ఇచ్చారు.