News March 1, 2025
జమ్మికుంట: ఉరేసుకుని యువకుడి ఆత్మహత్య

మనస్తాపంతో ఉరేసుకుని యువకుడు ఆత్మహత్య చేసుకున్న ఘటన జమ్మికుంట మండలం మడిపల్లిలో చోటుచేసుకుంది. మృతుని భార్య సాన స్వాతి తెలిపిన వివరాలు.. తన భర్త సాన శ్రీకాంత్ (36) చిరు వ్యాపారులకు డబ్బులు ఫైనాన్స్ ఇస్తూ జీవనోపాధి పొందేవాడన్నారు. అప్పు తీసుకున్న వ్యక్తి మృతిచెందడంతో నష్టం వచ్చిందని.. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు.
Similar News
News December 6, 2025
ఈ నెల 25న ‘అఖండ-2’ విడుదల!

బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్లో రూపొందిన ‘అఖండ-2’ ఈ నెల 25న రిలీజ్ కానున్నట్లు సినీవర్గాలు తెలిపాయి. ఇందులో ఎలాంటి మార్పు ఉండబోదని తెలిపాయి. దీనిపై మేకర్స్ అధికారిక ప్రకటన చేయాల్సి ఉంది. ఈ మూవీ నిన్ననే విడుదల కావాల్సి ఉండగా పలు కారణాలతో వాయిదా పడిన సంగతి తెలిసిందే.
News December 6, 2025
కామాలూరు-చిత్తూరు RTC బస్సు సర్వీసు ప్రారంభం

తవణంపల్లి మండలంలోని కామాలూరు-చిత్తూరు ఆర్టీసీ బస్సు సర్వీసును ఎమ్మెల్యే మురళీమోహన్ శనివారం ప్రారంభించారు. బస్సు సౌకర్యం లేకపోవడంతో గ్రామస్థులు తీవ్ర ఇబ్బంది పడుతున్నట్లు ఇటీవల పలువురు ఆయన దృష్టికి తీసుకెళ్లారు. త్వరలోనే బస్సు సౌకర్యం కల్పిస్తానని ఆయన హామీ ఇచ్చారు. ఇచ్చిన హామీ మేరకు బస్సు సర్వీసు ప్రారంభించడంతో గ్రామస్థులు హర్షం వ్యక్తం చేశారు.
News December 6, 2025
ఆయిల్ పామ్ రైతులను ఆదుకోండి.. MP పుట్టా రిక్వెస్ట్!

ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఆయిల్ పామ్ రైతులు నష్టపోతున్న పరిస్థితుల పట్ల ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం ఢిల్లీలో కేంద్ర వాణిజ్య పరిశ్రమల మంత్రిత్వ శాఖ కార్యదర్శి రాజేష్ అగర్వాల్ను కలిసిన ఎంపీ.. ముడి పామాయిల్ దిగుమతులపై సుంకాన్ని 10 శాతం తగ్గించడం వల్లే దేశీయంగా ధరలు పడిపోయి రైతులు తీవ్రంగా నష్టపోతున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెళ్లారు.


