News April 9, 2025
జమ్మికుంట: నిద్రిస్తున్న ఇద్దరు వ్యక్తులపై దూసుకెళ్లిన కారు

నిద్రిస్తున్న వ్యక్తులపై కారు దూసుకెళ్లిన ఘటన జమ్మికుంటలో చోటుచేసుకుంది. సీఐ రవి తెలిపిన వివరాల ప్రకారం.. లారీ డ్రైవర్లు సుమన్ కుమార్ మహత్, పబిత్ర మాజీ సోమవారం రాత్రి 10.30లకు ఆదిత్య కాటన్ ఇండస్ట్రీస్ ఎదురుగా నిద్రిస్తున్నారు. ఈ క్రమంలో మోత్కులగూడెంకు చెందిన పొనగంటి సాత్విక్ కారును అజాగ్రత్తగా నడుపుకుంటూ.. వాళ్ల కాళ్ల మీద నుంచి వెళ్లాడు. దీంతో వాళ్ల కాళ్ల విరిగిపోయాయి.
Similar News
News December 17, 2025
సంగారెడ్డి: జిల్లాలో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతం: కలెక్టర్

సంగారెడ్డి జిల్లాలో మూడు విడతల్లో పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించినట్లు కలెక్టర్ ప్రావీణ్య బుధవారం తెలిపారు. కలెక్టర్ మాట్లాడుతూ.. జిల్లాలో పంచాయతీ ఎన్నికలు విజయవంతంగా నిర్వహించిన ఎన్నికల సిబ్బంది పోలీస్ అధికారులకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదని చెప్పారు.
News December 17, 2025
ఈనెల 21న పల్స్ పోలియో: జేసీ

ఈనెల 21న పల్స్ పోలియో కార్యక్రమాన్ని జిల్లావ్యాప్తంగా సమర్థవంతంగా అమలు చేసి, ఐదేళ్లలోపు ప్రతీ చిన్నారికి పోలియో చుక్కలు వేయాలని జేసీ నూరుల్ ఖమర్ అధికారులను ఆదేశించారు. జిల్లాలో 3.52 లక్షల మంది చిన్నారులకు పోలియో చుక్కలు వేయడం లక్ష్యంగా 1,600 బూత్లు, మొబైల్ యూనిట్లు ఏర్పాటు చేశామని తెలిపారు. ఒక్క చిన్నారి కూడా మిస్ కాకుండా ఇంటింటి సర్వే, ట్రాన్సిట్ పాయింట్లలో ప్రత్యేక చర్యలు తీసుకున్నామన్నారు.
News December 17, 2025
నువ్వుల చేనులో మనుషులతో కలుపు నివారణ వల్ల లాభాలు

నువ్వుల పంటలో కలుపు ప్రధాన సమస్యగా ఉంటుంది. పంట విత్తిన 15-20 రోజుల లోపు చేనులో అదనపు మొక్కలను తొలగించాలి. విత్తిన 25-30 రోజుల తర్వాత మందులతో కలుపును నివారించకుండా మనుషులతో కలుపు తీయించాలి. దీని వల్ల కలుపు మొక్కలు నశించడమేకాకుండా భూమి గుల్లబారి ఎక్కువ తేమ భూమిలో నిల్వ ఉంటుంది. ఫలితంగా పంట త్వరగా నీటి ఎద్దడికి గురికాదు. విత్తనాలను వరుసల్లో విత్తితే చేనులో కలుపు తీయడానికి అనుకూలంగా ఉంటుంది.


