News February 10, 2025
జమ్మికుంట: నేటి నుంచి తాత్కాలికంగా భాగ్యనగర్ రైలు రద్దు

దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ట్రాక్ మరమ్మతుల కారణంగా నేటి నుంచి 21 వరకు భాగ్యనగర్తో సహా పలు రైళ్ల రాకపోకలు నిలిచిపోనున్నాయి. ప్రతి రోజూ జమ్మికుంట రైల్వే స్టేషన్ నుంచి సికింద్రాబాద్, కాజీపేట, పెద్దపల్లి, రామగుండం, మంచిర్యాల, కాగజ్నగర్ తదితర ప్రాంతాలకు వెళ్లేందుకు వేలాది మంది విద్యార్థులు, ఉద్యోగులు, వ్యాపారస్థులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు.
Similar News
News November 16, 2025
KNR: విటమిన్ గార్డెన్ పై దృష్టి పెట్టాలి:కలెక్టర్

ప్రతి ప్రభుత్వ పాఠశాలలో విటమిన్ గార్డెన్లపై బయోసైన్స్ ఉపాధ్యాయులు దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ఆదేశించారు. హౌసింగ్ బోర్డు కాలనీలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలను ఆమె సందర్శించి, మధ్యాహ్న భోజనం నాణ్యతను పరిశీలించారు. గార్డెన్లను ఆకర్షణీయంగా ఏర్పాటు చేయడంతో పాటు, పండిస్తున్న కూరగాయలు, ఆకుకూరల్లోని విటమిన్లు, మినరల్స్ గురించి కూడా విద్యార్థులకు వివరించాలని ఆమె సూచించారు.
News November 16, 2025
KNR: ‘కుక్కకాటు బాధితులకు ప్రత్యేక పర్యవేక్షణ అవసరం’

కుక్కలు, కోతులు కరిచిన వారికి అందిస్తున్న చికిత్సపై ప్రత్యేక పర్యవేక్షణ అవసరమని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి అన్నారు. శనివారం హౌసింగ్ బోర్డు కాలనీలోని అర్బన్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె సందర్శించారు. చికిత్స కోసం వచ్చిన వృద్ధులతో మాట్లాడి, వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. బీపీ, షుగర్ వంటి దీర్ఘకాలిక వ్యాధులకు మందులు ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా ఇస్తారని వారికి సూచించారు.
News November 16, 2025
కరీంనగర్: ‘గృహ నిర్మాణంలో పారదర్శకత పాటించాలి’

72వ జాతీయ సహకార వారోత్సవాల సందర్భంగా జిల్లా సహకార అధికారి కార్యాలయంలో గృహ నిర్మాణ సహకార సంఘాల అధ్యక్షులకు అవగాహన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా సహకార అధికారి రామానుజాచార్య మాట్లాడుతూ.. అర్హుల ఎంపికలో పారదర్శకత పాటించాలని, నిబంధనలను కచ్చితంగా అమలు చేయాలని సూచించారు. సహకార వ్యవస్థ ప్రజలకు అందుబాటులో ఉండేలా సంఘాలు సేవాభావంతో ముందుకు సాగాలని ఆయన పిలుపునిచ్చారు.


