News July 14, 2024

జమ్మికుంట: పేకాట స్థావరంపై పోలీసుల మెరుపు దాడి

image

జమ్మికుంట మండలం శంభునిపల్లిలో పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. పోలీసులు వారి నుంచి రూ.16,510 స్వాధీనం చేసుకున్నారు. వడ్లూరి రాజేశ్వర్, చింత రమణారెడ్డి, తన్నీరు శీను, మ్యాడగోని తిరుపతి, గడ్డం శ్రీనివాస్, మండల రాజేందర్ కర్నకంటి శ్రీనివాస్ రెడ్డి పట్టుబడ్డారు.

Similar News

News November 13, 2025

రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్‌గా కరీంనగర్

image

తెలంగాణ యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి జిల్లాలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ఓవరాల్ ఛాంపియన్‌గా కరీంనగర్ జిల్లా క్రీడాకారులు నిలిచారు. ఈ సందర్భంగా వీరిని జిల్లా కలెక్టర్ పమేలా సత్పతి ప్రత్యేకంగా అభినందించారు. వీరంతా జాతీయ స్థాయి పోటీల్లోనూ రాణించాలని ఆమె ఆకాంక్షించారు.

News November 12, 2025

హుజురాబాద్: రోడ్డు యాక్సిడెంట్ వ్యక్తి మృతి

image

హుజురాబాద్ మండలం పోతిరెడ్డిపేట నుంచి హర్షిత్, త్రినేష్ ద్విచక్ర వాహనంపై హుజురాబాద్ వైపు వెళ్తుండగా సిరిసపల్లి క్రాస్ రోడ్డు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో హర్షిత్, త్రినేష్‌లకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని చికిత్స నిమిత్తం వరంగల్‌లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ హర్షిత్ మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News November 12, 2025

కరీంనగర్: ఆస్తి కోసం వేధిస్తున్న కొడుకు, కొడలుపై ఫిర్యాదు

image

ఆస్తి కోసం తెల్ల కాగితం మీద సంతకం చేయించుకొని ఆస్తి కాజేయాలని తన కొడుకు, కోడలు ప్రయత్నిస్తున్నారని HZB ఆర్డీఓకు వృద్ధ దంపతులు ఫిర్యాదు చేశారు. జమ్మికుంటకు చెందిన గుల్లి లక్ష్మీ-మొగిలిలకు ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నట్లు చెప్పారు. పెద్ద కొడుకు, కోడలు సంపత్-స్వరూప తెల్ల కాగితం మీద సంతకాలు చేయించుకుని ఆస్తి కాజేయాలని చూస్తున్నారని ఆర్డీవోకు ఫిర్యాదు చేశారు. తమకు రక్షణ కల్పించాలని వారు కోరారు.