News July 5, 2024
జమ్మికుంట: భర్త వేధింపులతో భార్య ఆత్మహత్య

జమ్మికుంట పట్టణంలోని మారుతి నగర్‌కు చెందిన జీడి కావ్య (28) ఆత్మహత్య చేసుకున్నట్లు CI రవి తెలిపారు. CI వివరాలు.. వీణవంక మండలం ఎల్బాక గ్రామానికి చెందిన జీడి రాజుతో 12 ఏళ్ల క్రితం కావ్య వివాహం జరిగింది. కొన్ని రోజులుగా భార్య కావ్యను అనుమానంతో భర్త రాజు వేధించాడు. దీంతో బుధవారం రాత్రి ఇంట్లో కావ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. కావ్య తల్లి ఫిర్యాదు మేరకు రాజుపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
Similar News
News December 13, 2025
KNR: పంచాయతీ పోరుకు పటిష్ట భద్రత: సీపీ

కరీంనగర్ కమిషనరేట్ పరిధిలో రేపు జరగనున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలకు పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు సీపీ గౌష్ ఆలం తెలిపారు. మానకొండూరు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లోని 113 పంచాయతీల కోసం 1046 పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలు మోహరిస్తున్నట్లు చెప్పారు. శాంతిభద్రతల పరిరక్షణకు నిషేధాజ్ఞలు విధించారు. విజయోత్సవ ర్యాలీలు నిషేధమని స్పష్టం చేశారు.
News December 13, 2025
KNR: పోలింగ్ కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన భద్రత: సీపీ

శంకరపట్నం మండలంలోని మోడల్ స్కూల్‌లో ఏర్పాటు చేసిన ఎన్నికల సామగ్రి పంపిణీ కేంద్రాన్ని కరీంనగర్ పోలీస్ కమిషనర్ (సీపీ) గౌస్ ఆలాం శనివారం సందర్శించారు. 144 సెక్షన్ అమలులో ఉన్నందున గుంపులుగా సంచరించకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకోవాలని పోలీసులను ఆదేశించారు. రిటర్నింగ్ అధికారులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురైనా తక్షణమే పోలీస్ శాఖకు సమాచారం ఇవ్వాలని ఆయన సూచించారు.
News December 13, 2025
KNR: గ్రామ పంచాయతీ ఎన్నికల విధుల కేటాయింపుల్లో గందరగోళం

రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల సందర్భంగా విధుల కేటాయింపుల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. ర్యాండమైజేషన్ ప్రక్రియలో జరిగిన తప్పిదాల కారణంగా, ఇప్పటికే ఎన్నికల విధుల్లో ఉన్న ఉద్యోగులతో పాటు, బదిలీపై వేరే జిల్లాకు వెళ్లిన ఉద్యోగులు కూడా విధులకు హాజరు కావాలంటూ అధికారులు ఆదేశాలు జారీ చేస్తున్నారు. ఈ పరిస్థితి వల్ల ఉద్యోగుల్లో అయోమయం, ఆందోళన పెరిగింది.


