News February 12, 2026
జమ్మికుంట: భారీగా తగ్గిన పతి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ రెండు రోజుల విరామం తరువాత ఈరోజు ప్రారంభం కాగా.. పత్తి ధరలు భారీగా తగ్గాయి. గత సోమవారం గరిష్ఠంగా రూ.7,750 పలికిన పత్తి ధర గురువారం రూ.300 తగ్గి రూ.7,450 వద్ద నిలిచింది. ఈరోజు మార్కెట్‌కు మొత్తం 37 వాహనాల్లో 300 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి వచ్చింది. కొన్ని రోజులుగా మంచి ధర పలుకుతున్న పత్తి.. నేడు భారీగా తగ్గడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
Similar News
News March 13, 2026
ASF: ఉరుములతో వర్షాలు వచ్చే అవకాశం

ఆసిఫాబాద్ జిల్లాలో మార్చి 15, 16 తేదీలలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. గంటకు 30–40 కి.మీ వేగంతో గాలులు వీచే అవకాశముండటంతో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వ్యవసాయ పనులు, నిల్వ చేసిన ధాన్యం, పశువులను రక్షించుకునేలా ముందస్తు ఏర్పాట్లు చేసుకోవాలని అధికారులు తెలిపారు.
News March 13, 2026
NLG: ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 13,981 మంది హ్యాపీ

జిల్లాలో ఇంటర్ వార్షిక పరీక్షలు శుక్రవారంతో విజయవంతంగా ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ పేపర్లతో ఈ పరీక్షల పర్వం దిగ్విజయంగా పూర్తి కావడంతో విద్యార్థులు, అటు అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ద్వితీయ సంవత్సరం జనరల్ విభాగంలో 11,783 మంది, వొకేషనల్ విభాగంలో 2,248 మంది.. మొత్తం 13,981 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. పరీక్షల నిర్వహణలో సహకరించిన ప్రతిఒక్కరికీ డీఐఈఓ ధన్యవాదాలు తెలిపారు.
News March 13, 2026
బాపట్ల: ‘నిర్మాణ రంగాల్లో పన్నులు పక్కాగా వసూలు చేయాలి’

నిర్మాణ రంగాల్లో పన్నులు పక్కాగా వసూలు చేయాలని జిల్లా సంయుక్త కలెక్టర్ భావన వశిష్ఠ తెలిపారు. పన్ను వసూళ్ల కమిటీ, ఈ శ్రమ, కార్మిక సంక్షేమ బోర్డు జిల్లా స్థాయి కమిటీల సమావేశం శుక్రవారం బాపట్లలోని కలెక్టరేట్‌లో జరిగింది. నిర్మాణ రంగంలో కార్మికుల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందని జిల్లా సంయుక్త కలెక్టర్ అన్నారు. వారి కొరకు కార్మిక సంక్షేమ బోర్డు పనిచేస్తుందన్నారు.


