News August 16, 2024

జమ్మికుంట మార్కెట్‌కు మూడు రోజులు సెలవు

image

జమ్మికుంట పత్తి మార్కెట్‌కు మూడు రోజులు సెలవులు ఇస్తున్నట్లు కార్యదర్శి మల్లేశం తెలిపారు. ఈనెల 17న శనివారం వారాంతపు యార్డు బంద్‌, 18న ఆదివారం సాధారణ సెలవు, 19న సోమవారం రాఖీ పౌర్ణమి పండుగ సందర్భంగా సెలవు ఉన్నట్లు తెలిపారు. తిరిగి 20న మంగళవారం నుంచి క్రయవిక్రయాలు ప్రారంభమవుతాయని, రైతులు గమనించి సహకరించాలన్నారు.

Similar News

News December 1, 2025

‘TCC పరీక్షల కోసం దరఖాస్తు చేసుకోవాలి’

image

TG ప్రభుత్వ పరీక్షల విభాగం నిర్వహించే డ్రాయింగ్, టైలరింగ్, ఎంబ్రాయిడరీ TCC(టెక్నికల్ సర్టిఫికెట్ కోర్సు) పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఎలాంటి అపరాధ రుసుము లేకుండా DEC 5లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలంగాణ ఆర్ట్ వర్క్, ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ అసోసియేషన్ జిల్లాఅధ్యక్షులు తాడూరి లక్ష్మీనారాయణ సూచించారు. పూర్తి వివరాలకు www.bsetelangana.gov.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఆయన కోరారు.

News November 30, 2025

కరీంనగర్: 113 గ్రామాలకు 121 నామినేషన్లు

image

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామపంచాయతీ సర్పంచ్ ఎన్నికల మొదటి రోజు 113 గ్రామాలకు121 నామినేషన్లు దాఖలు అయినట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి తెలిపారు. చిగురు మామిడి మండలంలో 16, గన్నేరువరం మండలంలో 10, మానకొండూర్ మండలంలో 30, శంకరపట్నం మండలంలో 35, తిమ్మాపూర్ మండలంలో 30 గ్రామ సర్పంచికి నామినేషన్లు దాఖలు అయ్యాయి.113 గ్రామాలలో 1046 వార్డు లు ఉండగా, మొదటి రోజు 209 నామినేషన్లు వచ్చినట్లు తెలిపారు.

News November 30, 2025

కరీంనగర్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి

image

కరీంనగర్ రూరల్ మండలం నగునూరు శివారు చమనపల్లి రోడ్డు వద్ద ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మొదట రెండు బైక్‌లు ఢీకొనగా అటుగా వస్తున్న లారీ వారిపై నుంచి వెళ్లినట్లు స్థానికులు తెలిపారు. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరొకరికి గాయాలు కాగా స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మృతులు చామనపల్లి, సాంబయ్యపల్లికి చెందిన వారిగా గుర్తించారు. మరింత సమాచారం తెలియాల్సి ఉంది.