News February 25, 2026
జమ్మికుంట: రెండు రోజులుగా నిలకడగానే పత్తి ధర

జమ్మికుంట వ్యవసాయ మార్కెట్ కమిటీలో బుధవారం పత్తి ధరలు నిన్నటి లాగా నిలకడగానే కొనసాగాయి. మార్కెట్‌కు పత్తి రాక సాధారణంగా ఉన్నప్పటికీ రెండు రోజులుగా ధరల్లో పెద్దగా మార్పు లేకపోవడం గమనార్హం. మొత్తం 24 వాహనాల ద్వారా 205 క్వింటాళ్ల పత్తి అమ్మకానికి రాగా.. గరిష్టంగా రూ.7,550, కనిష్టంగా 7,000 ధర పలికింది. పత్తిలో తేమ శాతం తక్కువగా ఉండి, నాణ్యత బాగున్న పంటకు గరిష్ట ధర లభిస్తోందని అధికారులు సూచిస్తున్నారు.
Similar News
News April 16, 2026
రేపు ప.గో జిల్లాలో అభివృద్ధి పనులకు పవన్ కళ్యాణ్ శ్రీకారం

భీమవరంలో పలు అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలను డిప్యూటీ సీఎం కొణిదల పవన్ కళ్యాణ్ శుక్రవారం వర్చువల్‌గా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి తెలిపారు. ఉదయం 11 గంటలకు గంగానమ్మ గుడి వద్ద ఈ కార్యక్రమం జరగనుంది. కేంద్ర సహాయ మంత్రి శ్రీనివాస్ వర్మ, ఎమ్మెల్యే పాల్గొంటారని కలెక్టర్ పేర్కొన్నారు. అధికారులంతా సమన్వయంతో ఏర్పాట్లు పూర్తి చేయాలని ఆమె సూచించారు.

NRPT: ప్రమాదాల నివారణకు చర్యలు: కలెక్టర్

జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణకు అవసరమైన అన్ని జాగ్రత్త చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ప్రతీక్ జైన్ సూచించారు. ఆర్ అండ్ బి, నేషనల్ హైవే, పోలీసు శాఖ అధికారులు సమన్వయంతో పనిచేసి జిల్లాలో గుర్తించిన ప్రమాదం జరిగే స్థలాల్లో ప్రమాదాలు జరగకుండా రోడ్ సేఫ్టీ ఏర్పాట్లు చేయాలని అన్నారు. గురువారం నారాయణపేట కలెక్టరేట్‌లో ఎస్పీ డాక్టర్ వినీత్ తో కలసి రోడ్ సేఫ్టీ సమావేశం నిర్వహించారు. అధికారులు పాల్గొన్నారు.