News February 10, 2025

జమ్మికుంట: వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ జిల్లా కార్యదర్శిగా రాజు

image

వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజును నియమిస్తున్నట్లు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఛైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు రాజుకు నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. అంబాల రాజు మాట్లాడుతూ.. వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.

Similar News

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో తొలి ఫలితాన్ని ప్రకటించిన అధికారులు

image

ఇల్లందకుంట మండలం బోగంపాడు గ్రామ పంచాయతీ ఎన్నికల ఫలితాన్ని అధికారులు వెల్లడించారు. గ్రామంలోని ఎనిమిది వార్డులకు గాను ఏడు స్థానాలు ఏకగ్రీవం కాగా, మిగిలిన ఒక్క వార్డుకు బుధవారం పోలింగ్ నిర్వహించారు. లెక్కింపు పూర్తికావడంతో విజేతను ప్రకటించి, జిల్లాలోనే తొలి ఫలితంగా నిలిపారు. సర్పంచ్ స్థానం ఇదివరకే ఏకగ్రీవం కాగా, ఇప్పుడు వార్డు సభ్యుల ఎన్నిక పూర్తి కావడంతో ఉపసర్పంచ్ పదవిని ఎవరు దక్కించుకుంటారో చూడాలి.

News December 17, 2025

కరీంనగర్ జిల్లాలో మండలాల వారీగా పోలింగ్ ఎంతంటే..?

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఐదు మండలాల్లో కలిపి 84.35 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 110 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, 1,39,222 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లంతకుంటలో 85.35%, హుజురాబాద్‌లో 85.06%, జమ్మికుంటలో 82.10%, వీణవంకలో 82.39%, వి.సైదాపూర్‌లో అత్యధికంగా 87.46% పోలింగ్ నమోదైంది.

News December 17, 2025

కరీంనగర్: ఉ.9 వరకు 29,028 మంది ఓటేశారు

image

కరీంనగర్ జిల్లాలో మూడో విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ప్రశాంతంగా కొనసాగుతున్నాయి. ఉదయం 9 గంటల వరకు ఐదు మండలాల్లో కలిపి 17.59 శాతం పోలింగ్ నమోదైంది. మొత్తం 108 గ్రామ పంచాయతీల్లో 1,65,046 మంది ఓటర్లు ఉండగా, ఇప్పటివరకు 29,028 మంది ఓటు హక్కు వినియోగించుకున్నారు. మండలాల వారీగా ఇల్లందకుంటలో 22.58%, హుజూరాబాద్‌లో 20.87%, వీణవంకలో 20.06%, జమ్మికుంటలో 15.62%, వీ.సైదాపూర్‌లో 8.14% పోలింగ్ నమోదైంది.