News February 10, 2025
జమ్మికుంట: వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ జిల్లా కార్యదర్శిగా రాజు

వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ కరీంనగర్ జిల్లా కార్యదర్శిగా జమ్మికుంట మండలం మడిపల్లి గ్రామానికి చెందిన అంబాల రాజును నియమిస్తున్నట్లు వరల్డ్ కన్జ్యూమర్ రైట్స్ ఛైర్మన్ డాక్టర్ నలమాస శ్రీకాంత్ తెలిపారు. ఈ మేరకు రాజుకు నియామక పత్రాన్ని ఆదివారం అందజేశారు. అంబాల రాజు మాట్లాడుతూ.. వినియోగదారులకు నష్టం వాటిల్లకుండా ఎప్పటికప్పుడు ప్రజలను అప్రమత్తం చేసే కార్యక్రమాలను నిర్వహిస్తామన్నారు.
Similar News
News February 14, 2026
JMKT: ఒకరికి సున్నా.. ఆరుగురికి ఒక్కటే ఓటు!

జమ్మికుంట మున్సిపాలిటీలో కొందరు అభ్యర్థులకు వచ్చిన ఓట్లు చూస్తుంటే.. కనీసం వారి ఇంట్లోని వారు కూడా వారికి ఓటు వేయలేదా? అన్న సందేహం కలుగుతోంది. అన్నింటికంటే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే 6వ వార్డు నుంచి స్వతంత్ర అభ్యర్థికి సున్నా ఓట్లు వచ్చాయి. అంటే ఆమెకు సొంత ఓటు కూడా పడకపోవడం గమనార్హం. నలుగురు స్వతంత్ర అభ్యర్థులు, ఇద్దరు జనసేన అభ్యర్థులకు ఒకే ఒక ఓటు రావడం స్థానికంగా చర్చకు దారితీసింది.
News February 14, 2026
కరీంనగర్ యూనియన్ బ్యాంకులో అగ్నిప్రమాదం

కరీంనగర్ నగరంలోని యూనియన్ బ్యాంక్ బ్రాంచ్-2లో ఒక్కసారిగా మంటలు చెలరేగడం కలకలం రేపింది. గ్రౌండ్ ఫ్లోర్‌లోని ఒక గదిలో మంటలు వ్యాపించడంతో లోపల ఉన్న ఫర్నిచర్, రూఫ్ కప్పు పాక్షికంగా దగ్ధమయ్యాయి. అప్రమత్తమైన సిబ్బంది అగ్నిమాపక శాఖకు సమాచారం అందించారు. కరీంనగర్, మానకొండూరు నుంచి వచ్చిన రెండు ఫైర్ ఇంజన్లు శ్రమించి మంటలను అదుపులోకి తెచ్చాయి. సకాలంలో మంటలు ఆర్పడంతో పెను ప్రమాదం తప్పినట్లయింది.
News February 14, 2026
హుస్నాబాద్: పద్మ, సుప్రజ మూడోసారి..

హుస్నాబాద్ మున్సిపల్ ఎన్నికల్లో ఇద్దరు మహిళా కౌన్సిలర్లు హ్యాట్రిక్ విజయాన్ని సొంతం చేసుకున్నారు. 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి చిత్తారి పద్మ 50 ఓట్ల మెజార్టీతో, 18వ వార్డు నుంచి బీఆర్‌ఎస్ అభ్యర్థి వాల సుప్రజ 302 ఓట్ల ఆధిక్యంతో విజయం సాధించారు. దీంతో వరుసగా వీరు మూడోసారి కౌన్సిలర్లుగా ఎన్నికై హ్యాట్రిక్ సాధించారు. గతంలో తాము చేసిన అభివృద్ధి పనులే మళ్లీ గెలిపించాయని వారు పేర్కొన్నారు.


