News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్‌లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News April 1, 2025
ఇల్లందకుంట రామాలయం బ్రహ్మోత్సవాలు, జాతర వివరాలు

అపర భద్రాద్రిగా పేరొందిన ఇల్లందకుంట శ్రీ సీతారాముల బ్రహ్మోత్సవాలు ఏప్రిల్ 4 నుంచి ఏప్రిల్ 16 వరకు జరుగుతాయని ఈవో సుధాకర్ తెలిపారు. ఏప్రిల్ 6న మధ్యాహ్నం 12 గంటలకు శ్రీ సీతారాముల కళ్యాణం, ఏప్రిల్ 7న పట్టాభిషేకం,12న సూర్య రథోత్సవం( బండ్లు తిరుగుట)13, 14న చంద్ర రథోత్సవం(పెద్దరథం),15న శ్రీ పుష్పయాగం, 16న ఏకాంత సేవలు స్వామివారికి జరుపుతామన్నారు. భక్తులకు వైద్య, విద్యుత్, నీటి ఏర్పాట్లు చేశారు.
News March 31, 2025
KNR: డిప్యూటీ కలెక్టర్‌కు ఎంపికైన హరిణి

కరీంనగర్‌లోని విద్యానగర్‌కు చెందిన కన్నం హరిణి గ్రూప్-1లో 499.5మార్కులతో స్టేట్ 55వ ర్యాంక్ సాధించి, డిప్యూటీ కలెక్టర్‌కు సెలెక్ట్ అయ్యారు. హరిణి తల్లిదండ్రులు రమేష్, కళా ప్రపూర్ణ జ్యోతి ప్రభుత్వ టీచర్లు. విద్యానగర్లోనే ప్రాథమిక విద్యాను అభ్యసించిన హరిణి ఇంజనీరింగ్ పూర్తిచేసి సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పనిచేశారు. అనంతరం ఎలాంటి కోచింగ్ లేకుండా సొంతంగా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యారు.
News March 31, 2025
KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు…

KNR జిల్లాలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా ఉన్నాయి. గడచిన 24 గంటల్లో అత్యధికంగా ఇందుర్తి 40.6°C నమోదు కాగా, బురుగుపల్లి 40.5, జమ్మికుంట 40.3, వీణవంక 40.2, కొత్తపల్లి-ధర్మారం 40.1, ఖాసీంపేట 39.9, వెంకేపల్లి 39.7, బోర్నపల్లి 39.5, కొత్తగట్టు, దుర్శేడ్ 39.4, చింతకుంట, గంగాధర 39.3, ఆసిఫ్ నగర్, తాంగుల 39.0, రేణికుంట, కరీంనగర్ 38.8, ఈదులగట్టేపల్లి, మల్యాల 38.7, గుండి, నుస్తులాపూర్ 38.4°C గా నమోదైంది.