News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News November 26, 2025
కామారెడ్డి జిల్లాలో రేపు కవిత పర్యటన

TG జాగృతి చీఫ్ కవిత రేపు కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. నాగమడుగు లిఫ్ట్ ఇరిగేషన్, నిజాంసాగర్ ప్రాజెక్టులను సందర్శించనున్నారు. బాన్సువాడలో సోషల్ వెల్ఫేర్ జూ.కళాశాలను సందర్శించి, నాగిరెడ్డిపేటలో ముంపు రైతులతో సమావేశం కానున్నారు. నాగన్న బావి, శబరిమాత ఆశ్రమాన్ని సందర్శిస్తారు. కానిస్టేబుల్ కిష్టయ్య విగ్రహానికి నివాళులర్పించి, రైలు ప్రమాదంలో చనిపోయిన సుధాకర్ కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు.
News November 26, 2025
అంబేద్కర్ చూపిన మార్గంలో నడవాలి: ఎస్పీ

కామారెడ్డి జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ రాజేష్ చంద్ర ఆధ్వర్యంలో బుధవారం రాజ్యాంగ దినోత్సవం జరిగింది. ఆయన మాట్లాడుతూ.. పౌర హక్కులు, కర్తవ్యాలు, రాజ్యాంగం విలువలు తెలుసుకోవాలన్నారు. రాజ్యాంగాన్ని రచించిన డాక్టర్ బి.ఆర్. అంబేద్కర్ సేవలను స్మరించుకుంటూ, ఆయన చూపిన మార్గంలో నడవాలని పిలుపునిచ్చారు.
News November 26, 2025
గ్లోబల్ సమ్మిట్: పెట్టుబడిదారుల దృష్టికి సౌకర్యాల జాబితా

డిసెంబర్ 8, 9 తేదీల్లో పెట్టుబడిదారులను ఆకర్షించేందుకు ప్రభుత్వం అన్ని ప్రయత్నాలనూ చేస్తోంది. ముఖ్యంగా ఇక్కడ సర్కారు కల్పించనున్న సౌకర్యాలను వారికి కూలంకుషంగా వివరించనుంది. ORR, RRR, IRR, గ్రీన్ ఫీల్డ్ జాతీయ రహదారి, బందర్ పోర్టు వరకు మార్గం, కొత్తగా నిర్మించే రైలు మార్గాలు తదితరాలను వారికి అర్థమయ్యేలా ప్రొజెక్ట్ చేయనుంది. ఎప్పుడూ.. ఎక్కడా.. ఎలాంటి సమస్యలు రానివ్వబోమని కచ్చితమైన హామీ ఇవ్వనుంది.


