News March 21, 2025
జమ్మికుంట: శ్రీశైలం డ్యామ్లో పడి విద్యార్థి మృతి

కరీంనగర్ జిల్లా జమ్మికుంటకు చెందిన సాగర్ల సాయి తేజ (19) తన పుట్టినరోజు సందర్భంగా స్నేహితులతో కలిసి మల్లికార్జున స్వామిని దర్శించుకునేందుకు ఏపీలోని శ్రీశైలం వెళ్లాడు. స్వామివారిని దర్శించుకున్న అనంతరం అక్కడ జలాశయంలో స్నానం చేస్తుండగా ప్రమాదవశాత్తు అందులో పడి మృతి చెందాడు. కాగా సాయితేజ HYDలో పాలిటెక్నిక్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. సాయితేజ మృతితో కుటుంబంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
Similar News
News October 26, 2025
JNTU: OTPRIలో 31న ప్రాంగణ నియామకాలు

అనంతపురం జేఎన్టీయూ OTPRIలో ఈ నెల 31న ఉదయం 9:00 గంటలకు B.Pharm, M.Pharm విద్యార్థులకు ప్రాంగణ నియామకాలు నిర్వహిస్తున్నట్లు OTPRI డైరెక్టర్ సుబ్బారెడ్డి, ప్రిన్సిపల్ సి.గోపినాథ్ ఆదివారం తెలిపారు. 2022-25లో గ్రాడ్యుయేషన్ (B.Pharm, M.Pharm) పూర్తి చేసుకునే విద్యార్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు తమ బయోడేటా, ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరుకావాలని తెలిపారు.
News October 26, 2025
మూడు జిల్లాల కలెక్టర్లకు మంత్రి కొండపల్లి ఫోన్

మోంథా తుఫాన్ నేపథ్యంలో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు, గాలులు తీవ్రంగా కొనసాగే అవకాశం ఉన్నందున అన్ని శాఖలు అప్రమత్తంగా ఉండాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ ఆదేశించారు. ఫోన్ ద్వారా విజయనగరం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు జిల్లాల కలెక్టర్లతో ఆయన మాట్లాడారు. తుఫాను ప్రభావం కారణంగా ఏ పరిస్థితి వచ్చినా.. ప్రాణ, ఆస్తి నష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు.
News October 26, 2025
GWL: కురుమూర్తి జాతరకు స్పెషల్ బస్సులు-DM

మహబూబ్ నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం కురుమూర్తి రాయుడి బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని ఈనెల 28, 29 తేదీల్లో గద్వాల డిపో నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు డిపో మేనేజర్ సునీత ఆదివారం ప్రకటనలో పేర్కొన్నారు. మొదటి ట్రిప్పు గద్వాల నుంచి బయలుదేరి అనంతరం ఆత్మకూరు నుంచి కురుమూర్తి వరకు అవసరమైనన్ని ట్రిప్పులు నడుస్తాయన్నారు. భక్తులు ఇట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.


