News April 12, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News February 26, 2026
‘టాక్సిక్’ రన్‌టైమ్ షాక్.. 2 పార్ట్‌లుగా రానుందా?

రాకింగ్ స్టార్ యశ్ ‘టాక్సిక్’ రన్‌టైమ్‌పై వస్తున్న వార్తలు ఫ్యాన్స్‌ను ఆశ్చర్యానికి గురిచేస్తున్నాయి. ఈ భారీ గ్యాంగ్‌స్టర్ డ్రామా నిడివి కేవలం 2:20 గంటలేనన్న టాక్ నడుస్తోంది. ఇంత తక్కువ టైమ్‌లో భారీ కథను చూపించడం కష్టమని అందుకే రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేసే ఛాన్స్ ఉందనే చర్చ మొదలైంది. ఒకవేళ రన్‌టైమ్ నిజంగా తక్కువే ఉంటే ‘టాక్సిక్ 2’ పక్కా అని SMలో నెటిజన్లు చర్చించుకుంటున్నారు.
News February 26, 2026
గురువార వ్రత కథ

దయావంతుడనే ధనవంతుడు దానధర్మాలు చేసేవాడు. భార్యకు ఇవేం ఇష్టం లేదు. ఓరోజు బృహస్పతి సాధువుగా వచ్చి భిక్ష అడిగాడు. ఆమె సంపదంతా పోయి ప్రశాంతంగా ఉండాలని కోరింది. సాధువు చెప్పినట్లు ఆమె ధర్మానికి విరుద్ధంగా ప్రవర్తించి, దరిద్రం అనుభవించింది. ఆ తర్వాత పొరుగున ఉన్న పుణ్యస్త్రీ సలహాతో తన తప్పు తెలుసుకుని ఈ వ్రతం చేసింది. దీంతో బృహస్పతి ప్రసన్నుడై వారికి తిరిగి ఐశ్వర్యాన్ని, సుఖ సంతోషాలను ప్రసాదిస్తాడు.
News February 26, 2026
AI వల్ల ఆదాయం తగ్గినా ఓకే: TCS CEO

AI వల్ల కంపెనీ ఆదాయం తగ్గినా పర్లేదని TCS CEO కృతివాసన్ స్పష్టం చేశారు. ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఉద్యోగాలు పోతాయనే భయం తమకు లేదని, పైగా తమ 6 లక్షల మంది ఉద్యోగులు ఇందులో నైపుణ్యం సాధించాలని ఆదేశించారు. సీనియర్ల కంటే జూనియర్లే దీన్ని వేగంగా ఒంటబట్టించుకుంటున్నారని ఆయన అభిప్రాయపడ్డారు. AIని కేవలం వాడుకోవడం కాకుండా కొత్త సొల్యూషన్స్ బిల్డ్ చేయాలని ఉద్యోగులకు సూచించారు.


