News April 12, 2025

జమ్మిచేడు జమ్ములమ్మకు పౌర్ణమి సందర్భంగా ప్రత్యేక దర్శనం

image

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శనివారం పౌర్ణమి సందర్భంగా విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.

Similar News

News April 22, 2025

తుళ్లూరు: అక్కను హత్య చేసిన తమ్ముడికి యావజ్జీవ శిక్ష

image

తుళ్లూరు మండలం కొత్తూరు గ్రామంలో 2017లో జరిగిన ఆస్తి తగాదా హత్య కేసులో సోమవారం న్యాయస్థానం శిక్ష విధించింది. అక్కను హత్య చేసి, ఆమె కూతురిపై దాడి చేసిన షేక్ నాగుల్ మీరావాలికి యావజ్జీవ శిక్షతో పాటు రూ.1000 జరిమానా, మరోసారి 307 సెక్షన్ కింద 10 ఏళ్ల జైలు శిక్ష విధించింది. ఈ కేసు విచారణ చేసిన తుళ్లూరు మాజీ సీఐ సుధాకరరావు నేతృత్వంలోని బృందాన్ని గుంటూరు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ అభినందించారు.

News April 22, 2025

హత్యకు గురైన వడ్డీ వ్యాపారి: రాంబిల్లి సీఐ

image

రాంబిల్లి మండలం చినకలవలాపల్లి గ్రామంలో వడ్డీ వ్యాపారి జల్లి తాతారావు (65) హత్యకు గురయ్యాడు. ఈనెల 20 తేదీ రాత్రి మెడపై నిద్రిస్తుండగా గుర్తుతెలియని వ్యక్తులు దాడి చేసి తలపై కొట్టడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందినట్లు రాంబిల్లి సీఐ నర్సింగరావు సోమవారం తెలిపారు. కుటుంబ సభ్యులు రాజమండ్రిలో ఉంటున్నారు. కుమారుడు అప్పలరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

News April 22, 2025

అనంత జిల్లాలో చలివేంద్రాల ఏర్పాటు: కలెక్టర్

image

అనంతపురం జిల్లాలో నియోజకవర్గ వారిగా డెవలప్మెంట్ ప్లాన్‌ని తయారు చేయాలని జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. వేసవి నేపథ్యంలో చలివేంద్రాలను అవసరమైన చోట ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడ తాగునీటి సమస్య రాకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో తాగునీటి సౌకర్యం ఏర్పాటు చేయాలన్నారు. శాశ్వత ఆర్ఓ వాటర్ సౌకర్యం కల్పించాలన్నారు.

error: Content is protected !!