News February 21, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News November 24, 2025
TAKE A BOW.. 93 రన్స్, 6 వికెట్లు

టీమ్ ఇండియాతో రెండో టెస్టులో సౌతాఫ్రికా బౌలర్ మార్కో జాన్సెన్ అదరగొట్టారు. తొలి ఇన్నింగ్సులో 8వ స్థానంలో వచ్చిన అతడు 91 బంతుల్లోనే 93 రన్స్ చేశారు. ఏకంగా 7 సిక్సర్లు బాదారు. దీంతో సౌతాఫ్రికా భారీ స్కోర్ చేయగలిగింది. అటు బౌలింగ్లో 6 కీలక వికెట్లు తీసి భారత బ్యాటింగ్ ఆర్డర్ను కుప్పకూల్చారు. చక్కటి బౌన్సర్లతో మనోళ్లను ముప్పుతిప్పలు పెట్టారు.
News November 24, 2025
భక్తులకు ద్రోహం చేశారు: పవన్ కళ్యాణ్

AP: 2019-24 మధ్య తిరుమలకు వెళ్లిన భక్తులను మోసం చేశారని Dy.CM పవన్ కళ్యాణ్ మండిపడ్డారు. ఐదేళ్లలో 20కోట్లకు పైగా కల్తీ లడ్డూలు తయారు చేశారని సిట్ తేల్చిందన్న కథనాలపై ఆయన స్పందించారు. ‘గత TTD బోర్డులోని అధికారులు భక్తులకు ద్రోహం చేశారు. మనం భక్తితో నమస్కరిస్తుంటే, వాళ్లు మన హృదయాలను ముక్కలు చేశారు. నిబంధనలను ఉల్లంఘించడమే కాదు, మనం పెట్టుకున్న నమ్మకాన్ని కూడా తుంచేశారు’ అని ట్వీట్ చేశారు.
News November 24, 2025
వేములవాడలో ప్రచార రథం వద్ద కొనసాగుతున్న దర్శనాలు

వేములవాడ రాజన్న క్షేత్రంలో ఆలయం ముందు భాగంలోని ప్రచార రథం వద్ద భక్తులు రాజన్నను దర్శించుకుంటున్నారు. ప్రచార రథంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ స్వామివారి ఉత్సవ విగ్రహాలను వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు దర్శించుకుంటున్నారు. ప్రధాన ఆలయంలో అర్చకులు నిర్వహిస్తున్న స్వామివారి నిత్య కైంకర్యాలను ఎల్ఈడి స్క్రీన్ పై వీక్షించి తరిస్తున్నారు.


