News February 21, 2025
జమ్మిచేడు జమ్ములమ్మకు విశేష పూజలు

జోగులాంబ గద్వాల జిల్లా పరిధిలోని జమ్మిచేడులో వెలిసిన జమ్ములమ్మకు శుక్రవారం విశేష పూజలు జరిగాయి. ఆలయ అర్చకులు కృష్ణా నది జలాలతో అమ్మవారి విగ్రహాన్ని అభిషేకించి, అర్చన, ఆకు పూజ, హోమం తదితర పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. శుక్రవారం సందర్భంగా జమ్ములమ్మను దర్శించుకునేందుకు ఏపీ, తెలంగాణ నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
Similar News
News March 24, 2025
జగిత్యాల ప్రజావాణిలో 32 ఫిర్యాదులు

జగిత్యాల కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణికి 32 ఫిర్యాదులు వచ్చినట్లు కలెక్టర్ సత్యప్రసాద్ తెలిపారు. వచ్చిన ఫిర్యాదులను సంబంధిత శాఖల అధికారులకు పంపించి సమస్యలను త్వరగా పరిష్కరించాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కలెక్టర్ బిఎస్ లత, మెట్ పల్లి ఆర్డిఓ శ్రీనివాస్ తదితర అధికారులు పాల్గొన్నారు.
News March 24, 2025
జగిత్యాల: ధరణి సమస్యలను పరిష్కరించాలి: కలెక్టర్

ధరణి దరఖాస్తుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని కలెక్టర్ సత్య ప్రసాద్ అన్నారు. జగిత్యాల కలెక్టరేట్లో ఆర్డీవోలు, తహసిల్దార్ లతో సోమవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మండలాల వారిగా ధరణి దరఖాస్తుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. పెండింగ్ లో వున్న అన్ని దరఖాస్తులను ఈ నెల చివరి వరకు పూర్తి చేయాలన్నారు. అలాగే ధాన్యం కొనుగోలు కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలన్నారు. అడిషనల్ కలెక్టర్ తదితరులున్నారు.
News March 24, 2025
కరీంనగర్: ప్రజావాణిలో సాంకేతిక సమస్య.. ఇబ్బంది పడ్డ అర్జీదారులు

కరీంనగర్ కలెక్టర్ ప్రజావాణిలో సర్వర్ సమస్య తలెత్తడంతో అర్జీదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. తమ సమస్యలను విన్నవించేందుకు కలెక్టరేట్‌కు వచ్చారు. అయితే, సర్వర్‌లో సాంకేతిక సమస్య వల్ల కాస్త ఆలస్యం అయింది. అర్జీదారులు అధికారులపై అగ్రహం వ్యక్తం చేశారు. ఓవైపు ఎండ వేడిమి ఉండడతో కనీసం నీళ్ల సౌకర్యాలు కూడా కల్పించలేదని వాపోయారు. చివరకు సర్వర్ ప్రాబ్లం క్లియర్ అవడంతో అధికారులు అర్జీలు స్వీకరించారు.