News December 14, 2024
జమ్మూ కశ్మీర్‌లో కుప్పం జవాన్ మృతి
కుప్పం మండలానికి చెందిన ఓ జవాన్ జమ్మూ కశ్మీరులో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ములకలపల్లెకు చెందిన మునియప్ప కుమారుడు పొన్నుస్వామి రెండేళ్ల క్రితం సైన్యంలో చేరాడు. జమ్మూలో విధులు నిర్వహిస్తున్నఆయన రెండు రోజులు అనారోగ్యం పాలయ్యాడు. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచినట్లు వారు తెలిపారు. ఆయన అంత్యక్రియలు ఇవాళ సొంత గ్రామంలో జరగనున్నాయి.
Similar News
News January 21, 2025
BJP చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు
బీజేపీ చిత్తూరు జిల్లా అధ్యక్షుడిగా జగదీశ్వర్ నాయుడు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. జిల్లా ఎన్నికల రిటర్నింగ్ అధికారి కర్నాటి యల్లా రెడ్డి, జిల్లా పరిశీలకులు ముని సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో మంగళవారం అధ్యక్ష ఎన్నిక జరిగింది. పార్టీ రాజ్యాంగ సిద్ధాంతాల నియమావళి ప్రకారం ఏకగ్రీవంగా అధ్యక్షుడిని ఎన్నుకున్నారు. అనంతరం నియామక పత్రాలను అందజేశారు.
News January 21, 2025
ఎన్‌కౌంటర్‌లో చిత్తూరు జిల్లా వాసి మృతి..?
ఛత్తీస్‌గఢ్-ఒడిశా సరిహద్దుల్లో మంగళవారం జరిగిన ఎదురుకాల్పుల్లో 20 మంది మావోయిస్టులు చనిపోయిన విషయం తెలిసిందే. ఇందులో చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం ఎగువరాగిమానుపెంటకు చెందిన చలపతి అలియాస్ రామచంద్రా రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. కేంద్ర కమిటీ సభ్యుడిగా ఉన్న ఆయన గతంలో అలిపిరి వద్ద చంద్రబాబుపై దాడి చేయడంలో కీ రోల్ ప్లే చేశారు. ఆయనపై రూ.కోటి రివార్డు ఉంది.
News January 21, 2025
తిరుపతి SVUలో చిరుత కలకలం
తిరుపతిలోని ఎస్వీయూ, వేదిక్ యూనివర్సిటీ ప్రాంతంలో చిరుత సంచారం కలకలం రేపింది. సోమవారం రాత్రి హెచ్ బ్లాక్ ప్రాంతంలో విద్యార్థులకు చిరుత కనిపించిందని సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమిచ్చారు. ఫారెస్ట్ అధికారులకు యూనివర్సిటి సిబ్బంది సమాచారం ఇచ్చారు. కుక్కలు, దుప్పిల కోసం చిరుత వస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వేదిక్ యూనివర్సిటీలో పాద ముద్రలు ఉన్నట్లు గుర్తించారు.