News August 11, 2024

జమ్మూ కాశ్మీర్ ఎఫ్సీఐ జనరల్ మేనేజర్‌గా నర్సాపూర్ వాసి

image

జమ్ము కాశ్మీర్ రాష్ట్ర ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ) జనరల్ మేనేజర్‌గా నర్సాపూర్ మండలానికి చెందిన శత్రు నాయక్ నియమితులయ్యారు. ఇది వరకు దేశంలోనే వివిధ రాష్ట్రాల్లో పలు హోదాలో పనిచేశారు. మొన్నటి వరకు ముంబైలోని ఎఫ్సిఐ డీజీఎంగా పనిచేసిన ఆయన పదోన్నతిపై జమ్మూ కాశ్మీర్ రాష్ట్రానికి బదిలీపై వెళ్లారు. పదోన్నతి పై వెళ్లడంతో ఆయన స్నేహితులు, బంధువులు, గ్రామస్థులు ఆనందం వ్యక్తం చేశారు.

Similar News

News September 10, 2024

రాష్ట్రంలో ఉప ఎన్నికలు ఖాయం: హరీష్ రావు

image

రాష్ట్రంలో ఉప ఎన్నికలు జరగడం ఖాయమని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ పార్టీ ప్రజాస్వామ్య విధానానికి చెంపు పెట్టుతున్నదని పేర్కొన్నారు. పార్టీ మారిన ఎమ్మెల్యేలకు అనర్హతకు గురికావడం తద్యమన్నారు. ఈ క్రమంలో ఆయా సంబంధిత నియోజకవర్గంలో ఉప ఎన్నికలు రావడం ఖాయమని తెలిపారు.

News September 10, 2024

బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవు: ఎంపీ రఘునందన్

image

ఇతర పార్టీల తరహాలో బీజేపీలో కుటుంబ రాజకీయాలు ఉండవని మెదక్ పార్లమెంట్ సభ్యుడు రఘునందన్ రావు అన్నారు. సోమవారం సిద్దిపేట జిల్లా కేంద్రంలోని ఎన్జీవో భవన్లో బీజేపీ సభ్యత్వ కార్యక్రమంలో ఎంపీ పాల్గొని మాట్లాడారు. కార్యకర్త స్థాయి నుండి నాయకుని స్థాయికి ఎదిగే పార్టీ బిజెపిలో మాత్రమే సాధ్యమన్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమాన్ని బిజెపి కార్యకర్తలు, నాయకులు ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని ఎంపీ పిలుపునిచ్చారు.

News September 9, 2024

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు

image

విద్యార్థుల సామర్థ్యాలు పెంచేందుకే కాంప్లెక్స్ సమావేశాలు నిర్వహిస్తున్నట్లు మండల విద్యాధికారి శంకర్ తెలిపారు. సదాశివపేట మండలం నందికండి ఉన్నత పాఠశాలలో కాంప్లెక్స్ సమావేశం సోమవారం నిర్వహించారు. ఎంఈఓ మాట్లాడుతూ.. పాఠశాలలోని విద్యార్థుల సామర్థ్యాలపై చర్చించినట్లు చెప్పారు. సమావేశంలో నోడల్ అధికారి సుధాకర్, ఆర్పీలు పాల్గొన్నారు.