News March 14, 2025

జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

image

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.

Similar News

News December 2, 2025

చల్వాయి వార్డులను పంచుకున్న మూడు పార్టీలు..!

image

ములుగు జిల్లా గోవిందరావుపేట(M) చల్వాయి సర్పంచ్ స్థానాన్ని సయోధ్యతో కాంగ్రెస్ దక్కించుకుంది. 14 వార్డులను మూడు ప్రధాన పార్టీలు పంచుకున్నాయి. కాంగ్రెస్‌కు 7, BRSకు 4, BJPకి 3 చొప్పున తీసుకుంటూ తీర్మానించుకున్నాయి. ఉప సర్పంచ్ పదవిని BRSకు కేటాయించారు. పొలిటికల్ రింగ్‌లో నిత్యం తలపడే ఈ మూడు పార్టీలు పల్లె పోరులో మిత్రులుగా మారడం విశేషం. పదవుల పందేరంలో శాశ్వత మిత్రులు, శత్రువులు ఉండరని నిరూపణైంది.

News December 2, 2025

ఎన్నికల ఖర్చులకు కొత్త ఖాతా తప్పనిసరి: కలెక్టర్‌ తేజస్

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ ఎన్నికల వ్యయ వివరాల నమోదు కోసం తప్పనిసరిగా నూతన బ్యాంకు ఖాతా తెరవాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ తేజస్ స్పష్టం చేశారు. ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రతి అభ్యర్థి ప్రత్యేక ఖాతా కలిగి ఉండాలన్నారు. మూడో విడతలో నామినేషన్ వేయాలనుకునే వారు ముందుగానే కొత్త అకౌంట్ తీసుకుంటే నామినేషన్ ప్రక్రియ సులభమవుతుందని కలెక్టర్‌ సూచించారు.

News December 2, 2025

‘పాలమూరు ప్రాజెక్టులను గాలికొదిలేశారు’

image

సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధిఉంటే పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు పూర్తిచేసి సాగునీరు ఇవ్వాలని మాజీమంత్రి నిరంజన్ రెడ్డి డిమాండ్ చేశారు. మక్తల్ బహిరంగ సభలో సీఎం చేసిన వ్యాఖ్యలపై నిరంజన్ రెడ్డి స్పందించారు. మాటలు కోటలు దాటుతున్నాయని, రెండేళ్ల పాలనలో ఒక్క పని కూడా చేసింది లేదని విమర్శించారు. రైతులను గాలికి వదిలేసి బోనస్ అని బోగస్ మాటలతో మభ్యపెడుతున్నారని ఎద్దేవా చేశారు.