News March 14, 2025
జయ కేతనం సభలో ఆకట్టుకున్న ప్రదర్శన

చిత్రాడలో జనసేన జయకేతనం సభ అంగరంగ వైభవంగా జరుగుతోంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా కర్ణాటక జానపద నృత్యం ‘డొల్లు కుణిత’ కళాకారుల ప్రదర్శన విశేషంగా అలరించింది. అంతకుముందు వీర మహిళలు జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాసేపటి క్రితమే జనసేనాని పవన్ కళ్యాణ్ సభా వేదిక వద్దకు చేరుకున్నారు.
Similar News
News April 23, 2025
కామారెడ్డి: సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేసిన వరుణ్ రెడ్డి

టీజీఎన్‌పీడీసీఎల్ ఛైర్మన్ అండ్ ఎండీ వరుణ్ రెడ్డి బుధవారం కామారెడ్డి జిల్లాలోని సిరిసిల్ల రోడ్ వద్ద 33/11 కేవీ సబ్‌స్టేషన్‌ను తనిఖీ చేశారు. వినియోగదారులకు నిరంతర విద్యుత్ సరఫరా కల్పించేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. సబ్‌స్టేషన్‌లో సాంకేతికత అభివృద్ధిపై సూచనలు చేశారు. కలెక్టరేట్‌లో ఇంజినీర్లు, అకౌంట్స్ సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు.
News April 23, 2025
ఉగ్రదాడి మృతులపై అధికారిక ప్రకటన

పహల్‌గామ్‌లో టూరిస్టులపై నిన్న ఉగ్రవాదులు నరమేధం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ దాడిలో 25 మంది భారతీయులు, ఒక నేపాల్ దేశస్థుడు చనిపోయినట్లు కేంద్ర ప్రభుత్వం అధికారికంగా వెల్లడించింది. గాయపడిన వారు త్వరగా కోలుకునేలా అన్ని చర్యలు చేపట్టినట్లు వివరించింది. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలియజేసింది. ఈ ఉగ్రదాడిని ప్రపంచంలోని చాలా దేశాలు ఖండించాయని విదేశాంగ శాఖ కార్యదర్శి విక్రమ్ మిస్రీ వివరించారు.
News April 23, 2025
లింగంపేట్: దరఖాస్తులను క్యాటగరీ వారీగా నమోదు చేయాలని: కలెక్టర్

లింగంపేట్ మండలంలో నిర్వహిస్తున్న రైతు సదస్సుల్లో రైతులు సమర్పించిన దరఖాస్తులను క్యాటగరీల వారీగా నమోదు చేయాలని జిల్లా కలెక్టర్ ఆశిష్ సాంగ్వాన్ ఆదేశించారు. బుధవారం లింగంపేట్ తహశీల్దార్ కార్యాలయంలో దరఖాస్తుల నమోదు తీరును పరిశీలించారు. ఇప్పటి వరకు 10 గ్రామాల్లో సదస్సులు నిర్వహించి 1080 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. ఈ దరఖాస్తులపై ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు.