News July 27, 2024

జర్నలిస్టులకు సీఎం, డిప్యూటీ సీఎం హామీ

image

జర్నలిస్టులపై దాడులు, బెదిరింపు కాల్స్ రావడంపై చంద్రబాబు, పవన్‌లు స్పందించారు. తాడేపల్లిలో శనివారం వారు మాట్లాడుతూ.. జర్నలిస్టులపై ఎవరైనా దాడులు చేసినా, బెదిరింపులకు పాల్పడినా కఠిన చర్యలు ఉంటాయన్నారు. అది పాలకపక్షమైనా, ప్రతిపక్షమైనా తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. అనంతరం జర్నలిస్టులు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు.

Similar News

News October 17, 2025

మంగళగిరి: ‘మెడికల్ కాలేజీలపై వైసీపీ తప్పుడు ప్రచారం’

image

మంగళగిరిలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర కమిటీ రాష్ట్ర అధికార ప్రతినిధులు, ప్యానలిస్టుల కార్యక్రమాన్ని భాజపా రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్, ఆరోగ్యశాఖ మంత్రి సత్య కుమార్ యాదవ్ ప్రారంభించారు. కుల వివక్షతకు వ్యతిరేకంగా తిరుపతి నుంచి సంజీవని స్వరం పేరుతో కార్యక్రమం చేపడతామని మంత్రి తెలిపారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు నిర్మాణానికి చేపట్టిన పీపీపీ విధానంపై వైసీపీ కావాలనే తప్పుడు ప్రచారం చేస్తోందన్నారు.

News October 17, 2025

వసతి గృహ భవనాల ముఖచిత్రం మారాలి: కలెక్టర్

image

ప్రభుత్వ భవనాలలో నడుస్తున్న సంక్షేమ వసతి గృహాల ముఖ చిత్రాలు మారాలని కలెక్టర్ ఏ తమీమ్ అన్సారియా అన్నారు. ఇంజనీరింగ్, సంక్షేమ శాఖలతో శుక్రవారం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ భవనాల్లో ఉన్న 20 సాంఘిక సంక్షేమ, 8 బిసి సంక్షేమ, 3 గిరిజన సంక్షేమ వసతి గృహాలలో సహా అంగన్వాడీ కేంద్రాలలో అవసరమగు మౌలిక సదుపాయాలు గుర్తించాలని నివేదికలు అందజేయాలని ఇంజినీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

News October 17, 2025

గుంటూరులో గణనీయంగా తగ్గుతున్న దారిద్ర్యం

image

గుంటూరు జిల్లా పేదరికం తగ్గుదలపై నీతి ఆయోగ్ నిర్వహించిన జాతీయ బహుముఖ పేదరిక సూచీ (MPI)–2023 సర్వే ప్రకారం, గుంటూరు జిల్లాలో పేదరికం గణనీయంగా తగ్గింది.2015–16లో 8.51% మంది బహుముఖ పేదరికంలో ఉండగా, 2019–21 నాటికి ఇది 4.36%కి పడిపోయింది. ఇది దాదాపు 4.15 శాతం పాయింట్ల మెరుగుదల. విద్య, ఆరోగ్యం, శానిటేషన్‌ రంగాల్లో పురోగతి ఈ ఫలితాలకు దారితీసింది.
@నేడు అంతర్జాతీయ దారిద్ర్య నిర్మూలన దినోత్సవం