News December 15, 2024

జర్నలిస్ట్ రంజిత్‌కు క్షమాపణ చెప్పిన మోహన్‌బాబు

image

యశోద ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న జర్నలిస్ట్ రంజిత్‌కు నటుడు మోహన్ బాబు బహిరంగ క్షమాపణ చెప్పారు. మంచు విష్ణుతో కలిసి ఆయన ఆస్పత్రికి వెళ్లి బాధిత కుటుంబ సభ్యులను కలిశారు. అనంతరం రంజిత్ దగ్గరకు వెళ్లి క్షమాపణ చెప్పడమే కాకుండా ఆయన ఆరోగ్య పరిస్థితిని వైద్యులను అడిగి తెలుసుకున్నారు. రంజిత్‌పై దాడి కేసులో మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసిందే.

Similar News

News November 25, 2025

రేపు హైదరాబాద్‌లో వాటర్ బంద్

image

నగరానికి తాగునీటిని అందించే కృష్ణ ఫేజ్-1, 2, 3లో పంపింగ్ స్టేషన్లకు విద్యుత్ సరఫరా చేసే ఫీడర్లు, ట్రాన్స్ ఫార్మర్ల స్థానంలో కొత్తవి అమర్చనున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం ఉ.10 గం. నుంచి సా.4 గం. వరకు నీటి సరఫరాకు అంతరాయం ఉంటుందని పేర్కొన్నారు. చార్మినార్, వినయ్‌నగర్, భోజగుట్ట, రెడ్‌హిల్స్, నారాయణగూడ, ఎస్సార్ నగర్, హయత్‌నగర్, ఉప్పల్, రాజేంద్రనగర్, మీర్‌పేట్ తదితర ప్రాంతాల్లో అంతరాయం ఉంటుందన్నారు.

News November 24, 2025

HYD: రాహుల్ గాంధీ చేసిన అన్యాయాన్ని ఢిల్లీలో ఎండగడతాం: KTR

image

తెలంగాణ బీసీలకు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేసిన అన్యాయని ఢిల్లీలో ఎండగడతామని మాజీ మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణ భవన్‌లో ఆయన మాట్లాడుతూ.. ఎలాంటి రిజర్వేషన్ల పెంపు జరగకముందే 42% బీసీలకు రిజర్వేషన్లు తెలంగాణలో ఇచ్చినట్టు రాహుల్ గాంధీ చెప్పుకుంటూ తిరుగుతున్నారని ఆరోపించారు. ఆయన చేస్తున్న మోసాన్ని దేశ ప్రజల ముందు ఉంచుతామని పేర్కొన్నారు.

News November 24, 2025

HYD: ‘విద్యార్థుల వివరాలు వారంలో పంపండి’

image

HYDలో ప్రభుత్వ, ప్రవేట్ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థుల వివరాలను వారంలోపు పంపిచాలని కలెక్టర్ హరిచందన సంబంధిత అధికారులను ఆదేశించారు. ప్రీ మెట్రిక్ స్కాలర్‌షిప్స్‌పై ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో DRO వెంకటాచారితో కలిసి ఆమె పాల్గొన్నారు. విద్యార్థుల వివరాలు వారంలోపు అందజేయాలని విద్యాశాఖ అధికారులు ఆదేశించారు.