News December 12, 2024

జర్నలిస్ట్ రక్షణ చట్టాన్ని రూపొందించాలి: TSJU

image

జర్నలిస్టుల రక్షణ చట్టాన్ని రూపొందించి అమలు చేయాలని కోరుతూ TSJU రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో గురువారం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. చిన్న పత్రికల ఎంప్యానల్ మెంట్ చేయాలని, జర్నలిస్ట్ పెన్షన్ పథకాన్ని పకడ్బందీగా అమలు చేయాలని వారు కోరారు. అలాగే రూ.10 లక్షల ఉచిత జీవిత బీమా సదుపాయం కల్పించాలని కోరారు.

Similar News

News November 26, 2025

HYD చుట్టూ 4వ సింహం.. మీ కామెంట్?

image

GHMC విస్తరణతో ఇండియాలోనే అత్యధిక జనాభా కలిగిన నగరం మనదే అవుతుంది. దీంతో ఇప్పుడు ఉన్న వ్యవస్థ, అధికారులకు అడ్మినిస్ట్రేషన్ హ్యాండిలింగ్ సవాల్‌గా మారనుంది. పరిపాలన సౌలభ్యం కొరకు వ్యవస్థను కూడా పటిష్ఠం చేసేందుకు ప్రభుత్వం ఆలోచనలో ఉన్నట్లు సమాచారం. 3 కమిషనరెట్లు ఉంటే బాగుంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే, గ్రేటర్ చుట్టూ 4 కమిషనరేట్లు పెడితే ఎలా ఉంటుంది?.. దీనిపై హైదరాబాదీ కామెంట్?

News November 26, 2025

విలీనం ఎఫెక్ట్.. GHMC ఎన్నికలు ఆలస్యం?

image

GHMC ఎన్నికల కోసం ఎదురుచూస్తున్న కార్పొరేటర్లు మరికొంత కాలం ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 2014-16 మధ్య రెండేళ్ల పాటు ప్రత్యేక అధికారులతో గ్రేటర్‌ అడ్మినిస్ట్రేషన్ కొనసాగింది. ప్రస్తుతం 27 ULBలను విలీనానికి గ్రీన్ సిగ్నల్ రావడంతో అన్నీ సర్దుబాటు అయ్యేవరకు కనీసం 6 నెలల నుంచి ఏడాది సమయం పట్టేలా ఉంది. ఫిబ్రవరి 10తో పాలకవర్గం ముసిగినా.. ఎన్నికలు ఆలస్యం కానున్నాయి.

News November 26, 2025

పెరగనున్న గ్రేటర్ విస్తీర్ణం.. డివిజన్లు!

image

గ్రేటర్ విస్తీర్ణం ఫ్యూచర్‌లో భారీగా పెరగనుంది. ప్రస్తుతం 650 చదరపు కిలోమీటర్లు ఉన్న GHMC విలీనం తర్వాత దాదాపు 2735 చదరపు KMకు పెరగనుంది. విలీనం తర్వాత అడ్మినిస్ట్రేషన్‌లోనూ అనేక మార్పులు రానున్నాయి. GHMC పరిధిలో ఇప్పటివరకు 150 డివిజన్లు ఉన్నాయి. అదనంగా కార్పొరేషన్లు(7), మున్సిపాలిటీలు(20) తోడైతే డివిజన్ల సంఖ్య పెరగనుంది. ఈ నేపథ్యంలోనే నియోజకవర్గాల సంఖ్య పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.