News March 17, 2025
జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్కు బెయిల్

జర్నలిస్ట్ రేవతి, తన్వి యాదవ్కు నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.25 వేల పూచికత్తుతో బెయిల్ మంజూరు చేసింది. బెయిల్ పిటిషన్పై ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పు ఇవాళ్టికి వాయిదా వేసింది. కొద్దిసేపటి క్రితమే నాంపల్లి కోర్టు రేవతి, తన్వీ యాదవ్లకు బెయిల్ మంజూరు చేసింది. వారిపై పోలీసులు వేసిన కస్టడీ పిటిషన్ను కోర్టు డిస్మిస్ చేసింది.
Similar News
News March 18, 2025
దిల్సుఖ్నగర్లో యువతులతో వ్యభిచారం.. ARREST

సినిమాల్లో అవకాశాలు ఇప్పిస్తానంటూ యువతులను ఆకర్షించి, విటుల వద్దకు పంపుతున్న నాగమణి అనే మహిళను హ్యూమన్ ట్రాఫికింగ్, సరూర్నగర్ పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. డెకాయ్ ఆపరేషన్ ద్వారా ఆమెను దిల్సుఖ్నగర్లోని కమలానగర్ వద్ద రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు. యువతుల ఫొటోలను వాట్సాప్ ద్వారా కస్టమర్లకు పంపి సినిమా పేరుతో వ్యభిచార రొంపిలోకి దింపుతున్నట్లు గుర్తించారు.
News March 18, 2025
మెట్రో ప్రయాణికులకు GOOD NEWS

మెట్రో ప్రయాణికులకు అధికారులు గుడ్ న్యూస్ చెప్పారు. ఎండలు పెరిగిపోతుండటంతో బయటకు వెళ్లలేని పరిస్థితి. ఇక మెట్రోలో వెళ్లాలంటే రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీంతో ప్రయాణికుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ట్రిప్పుల సంఖ్య పెంచాలని భావిస్తున్నట్లు మెట్రోరైల్ ఎండీ ఎన్వీఎస్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం రోజుకు 1,065 ట్రిప్పులు తిరుగుతుండగా త్వరలో 1,500 వరకు పెంచుతామని తెలిపారు.
News March 18, 2025
Co-Living: హైదరాబాద్లో కొత్త కల్చర్!

HYDలో Co-Living కల్చర్ పెరుగుతోంది. ఒకే హాస్టల్, ఒకే గదిలో అమ్మాయిలు, అబ్బాయిలు ఉండొచ్చు. IT కారిడార్, హైటెక్స్, మాదాపూర్, KPHB తదితర ప్రాంతాల్లో ఇటువంటి PG హాస్టల్స్ వెలిశాయి. పైగా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ మరీ ఆకర్షిస్తున్నారు. వాస్తవానికి ఇతర ప్రాంతాల నుంచి నగరానికి వచ్చిన యువత ఎక్కువగా హాస్టళ్లలోనే ఉంటారు. ఇందులో కొందరు అమ్మాయిలు, అబ్బాయిలు ఒకే హాస్టళ్లలో ఉండేందుకు మొగ్గుచూపడం విశేషం.