News December 8, 2024

జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలు..APSSDC ద్వారా ఉచిత శిక్షణ

image

కృష్ణా: జర్మనీలో నర్సింగ్ ఉద్యోగాలకై APSSDC(ఏపీ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్) ఆధ్వర్యంలో ఉచిత శిక్షణ ఇవ్వనున్నారు. ఈ మేరకు సంబంధిత అధికారులు ఓ ప్రకటన విడుదల చేశారు. BSC నర్సింగ్, మిడ్‌వైఫరీ(GNM), జనరల్ నర్సింగ్ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ నెల 10లోపు ఈ శిక్షణకు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఎంపికైన వారికి 6 నెలల శిక్షణ ఉంటుందని, పూర్తి వివరాలకు APSSDC కార్యాలయంలో సంప్రదించవచ్చన్నారు.

Similar News

News January 5, 2026

కృష్ణాజిల్లాలో మాజీ మంత్రులు పర్యటన ఇక్కడే..!

image

మాజీ కేంద్రమంత్రి, దగ్గుబాటి పురందేశ్వరి, ఆంధ్రప్రదేశ్ ఎస్సీ కమిషన్ ఛైర్మన్, మాజీ మంత్రి కొత్తపల్లి శామ్యూల్ జవహర్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా దగ్గుబాటి పురందేశ్వరి పెడన మండలం జింజేరు గ్రామంలో పర్యటించనున్నారు. అదేవిధంగా కొత్తపల్లి శామ్యూల్ జవహర్ పెడన పట్టణంలోని రాజీవ్ నగర్ కాలనీలో పర్యటించనున్నారు. దీంతో స్థానిక బీజేపీ, టీడీపీ నేతలు పర్యటన ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు.

News January 4, 2026

గన్నవరంలో రేపు సబ్‌స్టేషన్‌ ప్రారంభం.. మంత్రుల రాక

image

AP ట్రాన్స్‌కో ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించిన 132/33 KV గన్నవరం విమానాశ్రయ సబ్‌స్టేషన్‌ను మంత్రి గొట్టిపాటి రవి కుమార్ సోమవారం ప్రారంభించనున్నారు. విమానాశ్రయ పరిసర ప్రాంతాల్లో విద్యుత్ లోటును అధిగమించేందుకు ఈ సబ్‌స్టేషన్‌ను అత్యాధునిక సాంకేతికతతో నిర్మించారు. కార్యక్రమంలో ముఖ్యఅతిథులుగా ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్, మంత్రులు వాసంశెట్టి, కొల్లు, గన్నవరం MLA యార్లగడ్డ పాల్గొననున్నారు.