News March 19, 2024
జలదంకి: గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా

జలదంకి మండల పరిధిలోని చిన్న కాక వద్ద అదుపుతప్పి గ్యాస్ సిలిండర్ లారీ బోల్తా పడిన ఘటన మంగళవారం చోటుచేసుకుంది. ఈ ఘటనలో డ్రైవర్ లారీలోనే చిక్కుకుపోవడంతో అటువైపుగా వెళ్తున్న వాహనదారులు రక్షించి బయటికి తీశారు. ఈ ప్రమాదంలో ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. స్వల్పంగా గాయపడిన డ్రైవర్ ను ఆసుపత్రిలో తరలించినట్లు స్థానికులు తెలిపారు.
Similar News
News December 3, 2025
నెల్లూరులో భారీ వర్షం.. నీట మునిగిన కారు

రాత్రి నెల్లూరు కార్పొరేషన్ పరిధిలో భారీ వర్షం కురిసింది. ఈ నేపథ్యంలో రోడ్లన్నీ జలమయం అయ్యాయి. ఈదురు గాలులకు 28వ డివిజన్లోని జీకే కాలనీలో భారీ చెట్టు పడిపోయింది. సమీపంలోని అపార్ట్మెంట్ సెల్లార్లోకి నీళ్లు రావడంతో కార్లు, బైకులు పూర్తిగా మునిగిపోయాయి. విషయం తెలుసుకున్న స్థానిక కార్పొరేటర్ అధికారులతో కలిసి వాటర్ను బయటికి తీయిస్తున్నారు.
News December 3, 2025
నెల్లూరులో టెక్స్టైల్స్ పార్క్ ఏది: లోక్ సభలో వేమిరెడ్డి

నెల్లూరు జిల్లాలో టెక్స్టైల్ పార్కును ఏర్పాటు చేసిందనేది వాస్తవమేనా అని నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి లోక్ సభలో మంగళవారం ప్రశ్నించారు. ప్రాజెక్టు వ్యయం రూ.103 కోట్లతో 10 యూనిట్లను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనలు ఏమయ్యాయని అడిగారు. దీనికి కేంద్ర జౌళిశాఖ సహాయ మంత్రి పబిత్రా మార్గరెట్ సమాధానమిస్తూ ప్రభుత్వం 2015లో ప్రకటించిందని, త్వరలో పూర్తి చేస్తామని, రూ.20 కోట్లు విడుదల చేశామని తెలిపారు.
News December 3, 2025
వాయు కాలుష్యం అంశంలో నెల్లూరు జిల్లా సేఫ్..!

జిల్లాలో వాయు కాలుష్యం నియంత్రణలో ఉందని అధికారులు భరోసా ఇస్తున్నారు. 1984లో జరిగిన భోపాల్ గ్యాస్ ఘోర విషాదంలో వేలమంది మృతి చెందిన ఘటనకు గుర్తుగా ప్రతి ఏటా DEC-2న జాతీయ కాలుష్య నివారణ దినంగా పరిగణిస్తారు. జిల్లాలో AQI 52 ఉండడం వలన సేఫ్ జోన్లో ఉన్నట్టుగా పరిగణించాలని అధికారులు చెబుతున్నారు. ప్రతి ఒక్కరు మొక్కలు నాటి ఆక్సిజన్ ఉత్పత్తిని పెంచాలని విజ్ఞప్తి చేస్తున్నారు.


