News July 22, 2024

జలుమూరులో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు అపహరణ

image

జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News October 28, 2025

SKLM: మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ ఉద్యోగాలు

image

నిరుద్యోగ మైనారిటీ యువతకు జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగ అవకాశాలు కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి ఉరిటి సాయికుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఐటిఐలో 2 సంవత్సరాలు, డిప్లోమాలో 3 సంవత్సరాలు అనుభవం ఉన్న యువకులు అర్హులన్నారు. నవంబర్ 2వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 99888 53335 నంబర్‌కు సంప్రదించాలని తెలియజేశారు.

News October 28, 2025

SKLM: ‘ఆపత్కాలంలో అధికారుల సమన్వయం కీలకం’

image

మొంథా తుఫాను ప్రభావం పెరుగుతున్న దృష్ట్యా, జిల్లాలోని వివిధ శాఖల మధ్య సమన్వయం కీలకమని జిల్లా ఇన్‌ఛార్జి కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్ అన్నారు. జిల్లా ప్రత్యేక అధికారి KVN చక్రధర బాబుతో కలిసి సోమవారం క్షేత్ర పర్యటన ముగించుకున్న అనంతరం, కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముఖ్యంగా డెలివరీ తేదీలు దగ్గర పడిన గర్భిణీలకు వెంటనే ఆసుపత్రిలో చేర్పించాలని ఆదేశించారు.

News October 28, 2025

శ్రీకాకుళం టుడే టాప్ హెడ్ లైన్స్ ఇవే

image

➫శ్రీకాకుళం జిల్లాపై మొంథా తుఫాన్ ప్రభావం
➫తుఫాన్ పై అప్రమత్తమైన జిల్లా అధికార యంత్రాంగం
➫శివనామస్మరణతో మార్మోగిన శివాలయాలు
➫మెండపేట-రాళ్లపేట రహదారి గుంతలమయం
➫శ్రీకాకుళం:చోరీ కేసులో ముగ్గురు అరెస్ట్
➫తుఫాన్ ప్రభావంపై అధికారులతో మంత్రి అచ్చెన్నాయుడు సమీక్ష
➫పొందూరు, ఎల్.ఎన్ పేటలో నేలమట్టం అయిన వరి పంట