News July 22, 2024

జలుమూరులో భారీ చోరీ.. రూ.9లక్షల నగదు అపహరణ

image

జలుమూరు మండలం సురవరంలో ఆదివారం చోరీ జరిగింది. సురవరం గ్రామానికి చెందిన శివప్రసాద్ వృత్తిరీత్యా శ్రీకాకుళంలో నివాసం ఉంటున్నారు. ఆయన తల్లి గ్రామంలో ఉండేది. ఆమె ఇటీవల హైదరాబాద్‌లోని చిన్నకుమారుడి వద్దకు వెళ్లింది. శివప్రసాద్ ఆదివారం ఇంటికి వచ్చి చూసేసరికి బీరువా తలుపులు తెరచి ఉండటాన్ని గుర్తించారు. బీరువాలోని రూ.9 లక్షల నగదు, వెండి వస్తువులు ఎత్తుకెళ్లినట్లు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

Similar News

News December 10, 2024

మందస వద్ద పులి అడుగు జాడలు

image

పలాస నియోజకవర్గం మందస మండలం చీపి ప్రాంతంలో పులి అడుగు జాడలు ఉన్నట్లు అధికారులు స్పష్టం చేశారు. సోమవారం ఈ అడుగులు ఉన్నట్లు గమనించారు. ఇటీవలే ఒడిశా ప్రాంతం నుంచి ఆంధ్ర సరిహద్దుల్లోకి పులి ప్రవేశించిందంటూ ఒడిశా అధికారులు, స్థానిక అధికారులు సమాచారం అందించారు. దీని పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులకు హెచ్చరికలు జారీ చేశారు.

News December 10, 2024

శ్రీకాకుళం: నిలిచిపోయిన పనులు ప్రారభించండి: విజయ

image

ఇచ్ఛాపురం నియోజకవర్గ సమస్యలపై శ్రీకాకుళం జిల్లా పరిషత్ ఛైర్పర్సన్ పిరియా విజయ కలెక్టరుకు లేఖ రాశారు. ఈ మేరకు సోమవారం జిల్లా పరిషత్ మీటింగ్ హాల్లో జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్‌ను కలిసి లేఖను అందజేశారు. ఇచ్ఛాపురం నియోజకవర్గం పరిధిలో గత ప్రభుత్వ హయాంలో వివిధ వంతెనలను ప్రతిపాదించి సాంకేతిక అనుమతులు, పరిపాలన, ఆర్థిక అనుమతుల మంజూరు చేసి టెండర్లను కూడా పిలిచామని ఆ పనులను ప్రారంభించాలని అభ్యర్థించారు.

News December 9, 2024

నరసన్నపేట- ఇచ్ఛాపురం హైవేను 6 లైన్లకు విస్తరించాలి

image

రాష్ట్ర సమగ్ర అభివృద్ధిలో భాగమయ్యేలా స్థానిక జిల్లా మీదుగా ఉన్న జాతీయ రహదారి -16ను మరింతగా అభివృద్ధి చేయాల్సి ఉందని మంత్రి రామ్మోహన్ నాయుడు అభిప్రాయం వ్యక్తం చేశారు. సోమవారం విశాఖపట్నంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. దీనికి అనుగుణంగా నరసన్నపేట – ఇచ్ఛాపురం మధ్య ఉన్న జాతీయ రహదారిని 6 లైన్లకు విస్తరించాలని హైవే అధికారులకు సూచించారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యే గొండు శంకర్‌ ఉన్నారు.