News August 17, 2024

జలుమూరు: దర్యాప్తునకు హాజరు కావాలని దివ్యాంగులకు నోటీసులు

image

జలుమూరు మండలం సైరిగాం పంచాయతీలో పలువురు నకిలీ దివ్యాంగ ధ్రువపత్రాలతో పింఛను పొందుతున్నారని గ్రామస్థులు ఇచ్చిన ఫిర్యాదుపై అధికారులు చర్యలు చేపట్టారు. ఈనెల 20న శ్రీకాకుళం రిమ్స్ ఆసుపత్రిలో సదరం ధ్రువపత్రాల నిర్ధారణకు హాజరు కావాలని 33 మంది పింఛనుదారులకు నోటీసులు జారీ చేసినట్లు ఎంపీడీవో పి.ఉమామహేశ్వరరావు శుక్రవారం తెలిపారు. దర్యాప్తునకు హాజరు కాకపోతే అనర్హులుగా గుర్తించి పింఛన్లు తొలగిస్తామన్నారు.

Similar News

News December 1, 2025

శ్రీకాకుళం: ‘దిత్వా తుఫాను పట్ల అప్రమత్తంగా ఉండాలి’

image

దిత్వా తుఫాన్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సూచించారు. ఈ మేరకు ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. తుఫాను ప్రభావంతో సోమవారం నుంచి భారీ ఏపీకి వర్ష సూచన ఉందని తెలిపారు. ప్రధానంగా రైతులు అప్రమత్తంగా ఉండాలని, స్థానిక వ్యవసాయ అధికారులు, రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకుని తమ పంటలను కాపాడుకోవాలని కోరారు.

News December 1, 2025

శ్రీకాకుళం: రహదారి భద్రతను మెరుగుపరచడంపై చర్యలు

image

జిల్లాలో రహదారి భద్రతను మెరుగుపరచడం, ప్రమాదాలను తగ్గించడం, ప్రజలకు ఇబ్బంది కలిగించే బహిరంగ మద్యం తాగడం, పబ్లిక్ న్యూసెన్స్‌పై ప్రత్యేక చర్యలు తీసుకున్నట్లు ఎస్పీ మహేశ్వర రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. జిల్లాలో 17,509 పైగా డ్రంకన్ డ్రైవ్, ఓపెన్ డ్రింకింగ్ కేసులు నమోదు కాగా.. వీటిలో 8,594 వేలకి పైగా కేసులు కోర్టుల ద్వారా శిక్షలు, జరిమానాల రూపంలో డిస్పోజ్ అయ్యాయని ఎస్పీ చెప్పారు.