News January 23, 2025

జలుమూరు: బ్యానర్‌లో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై ఆక్షేపణ

image

జలుమూరు మండలం లింగాలవసలో నిర్వహించిన పశు వైద్య శిబిరం కార్యక్రమంలో బ్యానర్లపై ఎమ్మెల్యే ఫోటో లేకపోవడంపై టీడీపీ శ్రేణులు భగ్గుమన్నాయి. ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి ఫొటో ఎందుకు ముద్రించలేదంటూ టీడీపీ నేతలు ప్రశ్నించారు. ఇది ప్రొటోకాల్‌ను ఉల్లంఘించడమేనని ఫైర్ అయ్యారు. అయితే బ్యానర్లు డైరెక్టరేట్ నుంచి వచ్చాయని స్థానికంగా తయారు చేసి ఉంటే ఎమ్మెల్యే ఫొటో ముద్రించే వాళ్లమని ఏడి రాజగోపాల్ రావు వివరణ ఇచ్చారు.

Similar News

News October 28, 2025

పలాస: జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లు రద్దు

image

మొంథా తుపాన్ నేపథ్యంలో శ్రీకాకుళం జిల్లా మీదుగా వెళ్లే పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లు మంగళవారం రైల్వే అధికారులు వెల్లడించారు. జిల్లా మీదుగా వెళ్లే భువనేశ్వర్-బెంగళూరు(ప్రశాంతి ఎక్స్‌ప్రెస్), భువనేశ్వర్-హైదరాబాద్(విశాఖ ఎక్స్‌ప్రెస్), కోణార్క్ ఎక్స్‌ప్రెస్‌తో పాటు విశాఖ-బరంపురం(ఇంటర్ సీటీ) ఎక్స్‌ప్రెస్, పలాస-విశాఖ(మెమో) ప్యాసెంజర్ రైళ్లు రద్దు చేశారు. రైల్వే ప్రయాణీకులు గమనించాలని కోరారు.

News October 28, 2025

ఒకడు ఇళ్ల తలుపులు.. మరొకడు బీరువా విరగ్గొట్టడంతో దిట్ట!

image

శ్రీకాకుళం జిల్లాలో రాత్రి పూట దొంగతనాలు చేస్తున్న ముఠాను <<18122311>>పోలీసులు పట్టుకున్న సంగతి తెలిసిందే<<>>. వీరు కాకినాడకు చెందిన వారు. వేంకటేశ్వర్లు, ప్రసాద్‌ పదేళ్లుగా దొంగతనాలు చేస్తున్నారు. ఒకరు తాళాలు వేసిన ఇళ్ల తలుపులు విరగ్గొట్టడంలో ఎక్స్‌పర్ట్ అయితే మరొకడు బీరువా తలుపులు తెరవడంలో దిట్ట. వీరికి కాకినాడ సెంట్రల్ జైలులో క్రిమినల్ మోహనరావు పరిచమయ్యాడు. వీరంతా కలిసి జిల్లాపై కన్నేసి వరుస దొంగతనాలు చేశారు.

News October 28, 2025

శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లు రద్దు

image

తుఫాన్ ప్రభావంతో శ్రీకాకుళం జిల్లా మీదుగా నడిచే 20 రైళ్లను రద్దు చేస్తున్నట్లు ఈస్ట్ కోస్టు రైల్వే జీఎం పరమేశ్వర ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రయాణికుల భద్రత మేరకు అక్టోబర్ 27, 28, 29 తేదీల్లో రైళ్ల రాకపోకలను నిలిపివేస్తున్నట్లు చెప్పారు. ప్రయాణికులు గమనించాలని రైల్వే అధికారులను సూచించారు.