News April 3, 2025

జలుమూరు: రోడ్డు ప్రమాదంలో విద్యుత్ శాఖ ఉద్యోగి మృతి

image

జలుమూరు మండలం కరవంజ పంచాయతీ తుంబయ్య పేట గ్రామానికి చెందిన రవికిరణ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. పలాసలో విద్యుత్ శాఖలో షిఫ్ట్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నారు. గురువారం నందిగామ వద్ద జరిగిన ప్రమాదంలో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మరణించారు. ఇటీవల నరసన్నపేటలో జరిగిన డే అండ్ నైట్ క్రికెట్ మ్యాచ్‌లో ఎంపైర్‌గా సేవలు అందించారు. వైఎంసీఏ కార్యదర్శి గొద్దు చిట్టిబాబు దిగ్ర్భాంతి  వ్యక్తం చేశారు.

Similar News

News January 5, 2026

టెక్కలి: 10 సార్లు సర్పంచ్‌గా పనిచేసిన వ్యక్తి మృతి

image

టెక్కలి మండలం పెద్దసానకు చెందిన కోట చిన్నబాబు (103) సోమవారం మృతిచెందారు. గ్రామానికి చెందిన చిన్నబాబు సుమారు 50 ఏళ్లు (10 సార్లు) గ్రామ సర్పంచ్‌గా పని చేశారు. అంతే కాకుండా ఒక విద్యా సంస్థల ఛైర్మన్‌గా.. రైతు సంఘం నాయకునిగా సుదీర్ఘ కాలం సేవలు అందించారు. వృద్ధాప్యం, అనారోగ్య సమస్యల కారణంగా సోమవారం మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ప్రముఖులు నివాళులు అర్పించారు.

News January 5, 2026

శ్రీకాకుళం: యాక్టివ్ మోడ్‌లోకి ఆ సీనియర్ నేత..పొలిటికల్ గేమ్‌కేనా!

image

2024 ఎన్నికలనంతరం రెండేళ్లుగా మాజీ మంత్రి ధర్మాన ప్రసాద రావు మౌనంగా ఉన్నారు. వైసీపీ కార్యక్రమాలకు దూరంగానే ఉన్నారు. కూటమిని విమర్శించ లేదు. అయితే ఇటీవల పలు సమావేశాల్లో పక్కా లెక్కలతో మాట్లాడి యాక్టివ్ మోడ్‌లోకొచ్చారు. ఏపీ రాజకీయాల్లో సుదీర్ఘ అనుభవం ధర్మాన ప్రసాద్‌కు ఉంది. ఈ సీనియర్‌తోనే వైసీపీ అధినేత జగన్‌ తాడేపల్లి నుంచి పార్టీ బలోపేతానికి వ్యూహం రచిస్తారని అంతర్గత చర్చ సాగుతోంది.

News January 5, 2026

SKLM: పది పాసైతే చాలు 350 ఉద్యోగాలు

image

ఈనెల 7న కొత్తూరులోని శ్రీ వేంకటేశ్వర డిగ్రీ కళాశాల ప్రాంగణంలో మెగాజాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి శాఖ అధికారి సాయికుమార్ ఆదివారం తెలిపారు. 10 కంపెనీలకు చెందిన యాజమాన్యాలు 350 ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహిస్తాయన్నారు. టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ చదివి 18-30 ఏళ్ల వయసున్న నిరుద్యోగులు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు.