News October 31, 2024
జల్లాపల్లి: పేకాట స్థావరంపై దాడి.. ఐదుగురు అరెస్ట్
నిజామాబాద్ జిల్లా పొతంగల్ మండలంలోని జల్లాపల్లి ఫారం గ్రామంలో పేకాట స్థావరంపై దాడి చేసినట్లు ఎస్ఐ సందీప్ తెలిపారు. పేకాట కేంద్రంలో ఐదుగురు పేకాట రాయుళ్లను అరెస్ట్ చేశామన్నారు. వారి వద్ద నుంచి రూ.7,350 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. పేకాట ఆడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. గ్రామాల్లో పేకాట ఆడితే సమాచారం అందించాలని ఎస్ఐ కోరారు.
Similar News
News October 31, 2024
బోధన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు సూపర్ లగ్జరీ బస్సు
బోధన్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టుకు నవంబర్ 4వ తేదీ నుంచి ఆర్టీసీ సూపర్ లగ్జరీ బస్సు నడపనున్నట్లు డీఎం శ్రీనివాస్ తెలిపారు. ప్రతి రోజూ సాయంత్రం 5:30 గంటలకు బస్సు బోధన్ నుంచి బయల్దేరుతుందని, వర్ని, బాన్సువాడ, మెదక్, నర్సాపూర్, జేబీఎస్ మీదుగా శంషాబాద్ ఎయిర్ పోర్టుకు చేరుకుంటుందన్నారు. బోధన్ నుంచి ఎయిర్ పోర్టుకు ఒక్కొక్కరికి రూ.590 చార్జీ ఉంటుందని తెలిపారు.
News October 31, 2024
సదాశివ నగర్: గుర్తుతెలియని వ్యక్తి దారుణ హత్య
కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం లింగంపల్లి గ్రామ శివారులో పండగ నాడు ఘోరం జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. బుధవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తిని హత్య చేశారని ఎస్ఐ చెప్పారు. ఈ వ్యక్తికి ఎడమ చేయి లేదని పేర్కొన్నారు. వివరాలకు సదాశివ నగర్ పోలీసులను సంప్రదించాలని తెలిపారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News October 31, 2024
నిజామాబాద్: బాలికపై అత్యాచారం.. నిందితుడికి జీవితఖైదు
బాలికపై అత్యాచారం చేసిన నిందితుడికి జీవితఖైదు విధించారు. బోయిన్పల్లి CI, SI వివరాల ప్రకారం.. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లికి చెందిన సాయిలు సికింద్రాబాద్లోని ఓ ఫంక్షన్హల్లో ఎలక్ట్రీషియన్గా పనిచేస్తున్నాడు. అక్కడ హౌస్కింపింగ్ చేసే వ్యక్తి కూతురిపై 2019లో సాయిలు పలుసార్లు అత్యాచారం చేశాడు. 2020లో బాలిక గర్భందాల్చడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో నాంపల్లి కోర్టు జీవిత ఖైదు విధించింది.