News August 11, 2024
జల వనరులను కాపాడుకోవాలి: కడప కలెక్టర్

కడప జిల్లాలో అందుబాటులో ఉన్న జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం దువ్వూరులోని చల్లబసాయపల్లి గ్రామ సమీపంలో తెలుగుగంగా ఉప జలాశయం-1 నుంచి ఉప జలాశయం-2కు జలహారతి ఇచ్చి, నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని తెలిపారు.
Similar News
News November 17, 2025
మైదుకూరు ఎమ్మెల్యే కేసులో నిందితుల అరెస్ట్

మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్‌ను బెదిరించిన ఏడుగురిని హైదరాబాద్ పోలీసులు అరెస్టు చేశారు. డిజిటల్ అరెస్ట్ పేరిట సైబర్ నేరగాళ్లు ఎమ్మెల్యేను బెదిరించి రూ.1.70 కోట్లు కాజేశారు. తాజాగా ఈ కేసులోని నిందితులను సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల్లో ఢిల్లీకి చెందిన ఐడీఎఫ్సీ బ్యాంక్ మేనేజర్ కూడా ఉండడం గమనార్హం.

ప్రొద్దుటూరు అంటే భయపడుతున్న అధికారులు..?

ప్రొద్దుటూరులో పనిచేయాలంటే అధికారులు వణికిపోయే పరిస్థితి ఏర్పడింది. వైసీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో పనిచేసిన 43మంది అధికారులపై ఇప్పుడు విచారణకు ఆదేశించారు. ఇక్కడి హౌసింగ్ శాఖలోని నలుగురు సిబ్బందిపై క్రిమినల్ చర్యలకు ఆదేశించారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీ నేతలు ఇక్కడి అధికారులను ఇష్టారీతిగా వాడుకుంటున్నారు. ఆ తర్వాత ప్రభుత్వం మారినప్పుడల్లా ఆ అధికారులు ఇబ్బంది పడుతున్నారు.