News August 11, 2024

జల వనరులను కాపాడుకోవాలి: కడప కలెక్టర్

image

కడప జిల్లాలో అందుబాటులో ఉన్న జల వనరులను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని జిల్లా కలెక్టర్ శివశంకర్ లోతేటి పేర్కొన్నారు. శనివారం దువ్వూరులోని చల్లబసాయపల్లి గ్రామ సమీపంలో తెలుగుగంగా ఉప జలాశయం-1 నుంచి ఉప జలాశయం-2కు జలహారతి ఇచ్చి, నీటిని విడుదల చేసే కార్యక్రమాన్ని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్‌తో కలిసి ఆయన ప్రారంభించారు. తాగు, సాగు నీటికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయడం జరిగిందని తెలిపారు.

Similar News

News September 18, 2024

వరద బాధితులకు బీ.టెక్ రవి సహాయం.. ఎంతంటే.!

image

విజయవాడ వరద బాధితులకు టీడీపీ పులివెందుల ఇన్‌ఛార్జ్ బీటెక్ రవి అండగా నిలిచారు. తన సొంత నిధులు రూ.6 లక్షలు విరాళంగా ప్రకటించారు. అలాగే పులివెందుల నాయకులు, కార్యకర్తల నుంచి మరో రూ.4 లక్షలు విరాళంగా వచ్చాయి. మొత్తం రూ.10 లక్షల చెక్కును రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబుకు బీటెక్ రవి అందజేశారు.

News September 18, 2024

ప్రత్యేక అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలి: కలెక్టర్

image

కడప జిల్లాలోని మండల ప్రత్యేకాధికారులు ప్రాధాన్యతా అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శివశంకర్ అధికారులను ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో పీఎం విశ్వకర్మ యోజన, సాలిడ్ వెస్ట్ ప్రాసెసింగ్ సెంటర్, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక, స్వచ్ఛతా హీ సేవ, హౌసింగ్, నూతన ఇసుక పాలసీ, తదితర అంశాలపై సమావేశం నిర్వహించారు. ప్రతి మండలంలో అభివృద్ధిపై దృష్టి సారించాలని సూచించారు

News September 17, 2024

రాజంపేట: సెప్టెంబర్ 20న జాబ్ మేళా నిర్వహణ

image

రాజంపేట పాలిటెక్నిక్ కళాశాల ప్రాంగణంలో సెప్టెంబర్ 20న జాబ్ మేళా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జేసీ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల్లోని యువకులు జాబ్ మేళాను సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం జాబ్ మేళా పోస్టర్‌ను జాయింట్ కలెక్టర్ ఆవిష్కరించారు. నిరుద్యోగ యువతీ యువకుల కోసం జాబ్ మేళా ఏర్పాటు చేసినట్లు వివరించారు. కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వైదియా దేవి పాల్గొన్నారు.